జీయర్‌పై అనుచిత వ్యాఖ్య: యాష్కీపై ఫిర్యాదు
హైదరాబాద్: కాంగ్రెస్ నేత, మాజీ పార్లమెంటుసభ్యుడు మధు యాష్కీపై బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. చిన్నజీయర్ స్వామిపై మధుయాష్కీ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి సుందర్ రాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
8మంది క్రికెట్ బుకీల అరెస్ట్
హైదరాబాద్ నగరంలోని మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 8 మంది క్రికెట్ బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. బుకీల నుంచి రూ. 14.42లక్షల నగదు, రెండు కార్లు, 16 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

జీడిమెట్లలో మహిళ అనుమానాస్పద మృతి
జీడిమెట్ల శ్రీరామ్‌నగర్‌లో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే ఆమె బంధువులు మాత్రం భర్తే హత్య చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురు కుమార్తెలతో కలిసి భర్త పరారయ్యాడు. దీంతో పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
సిలిండర్ల లారీని ఢీకొన్న ఇన్నోవా: ముగ్గురు మృతి
నల్గొండ జిల్లాలోని ఆలేరు సమీపంలో ఇన్నోవా వాహనం ఎదురుగా ఖాళీ సిలిండర్లతో వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
క్షతగాత్రులంతా హైదరాబాద్‌లోని హబ్సిగూడ, సీతాఫల్ మండి ప్రాంతానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. బంధువుల అంత్యక్రియల కోసం వరంగల్ లోని పోచన్న పేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications