విషాదం: స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాన్వాయ్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి
హైదరాబాద్: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాన్వాయ్‌లోని ఓ వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. కాళ్ళకల్ గ్రామంలో నివాసముంటున్న నర్సింహారెడ్డి(50) రోడ్డు దాటుతుండగా సోమవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నర్సింహారెడ్డి అక్కడికక్కడే చనిపోయాడు. నర్సింహారెడ్డి ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన ఉద్యోగిగా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

విషాదం: పెళ్లిచూపులకు వెళ్లి తిరిగివస్తుండగా ప్రమాదం
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పెళ్లి చూపులకు వెళ్లి వస్తూ యువకుడితోపాటు మరో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.
ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన బేతా సూరిబాబు (26) పెళ్లిచూపుల కోసం.. బంధువులతో కలిసి కారులో రాజమహేంద్రవరం వెళ్లారు. ఈ కార్యక్రమం పూర్తయిన అనంతరం కారులో తిరిగి ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో వారంతా ప్రయాణిస్తున్న కారు అనంతపల్లి వద్ద ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది.
కారు వేగంగా ఢికొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. బేతా గోవిందరావు(65), భీమడోలు మండలం కొండ్రుపాడుకు చెందిన కారు డ్రైవరు జక్కుల శివాజీ (28) అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రగాయాలైన సూరిబాబును ఏలూరు ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి గాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు












Click it and Unblock the Notifications