దారుణం: భార్యతో కాపురం చేసుకోరా కొడుకా అంటే.. తండ్రి నోట్లో విషం పోశాడు!

కన్న కొడుకే కాలమయుడై తండ్రిని కడతేర్చాడు. జులాయి తిరుగుడు మాని బుద్ధిగా కాపురం చేసుకో కొడుకా అని చెప్పినందుకు నోట్లో పురుగుల మందు పోశాడు.

వరంగల్‌: కన్న కొడుకే కాలమయుడై తండ్రిని కడతేర్చాడు. జులాయి తిరుగుడు మాని బుద్ధిగా కాపురం చేసుకో కొడుకా అని చెప్పినందుకు నోట్లో పురుగుల మందు పోశాడు. చికిత్సపొందుతూ తండ్రి మృతిచెందాడు. మానవ సంబంధాలను మంటగలుపుతూ మానవత్వానికే మాయని మచ్చలాంటి ఈ దారుణ ఘటన కాజీపేట మండలం కడిపికొండలో జరిగింది.

మడికొండ ఇన్‌స్పెక్టర్‌ కానగాని శ్రీధర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కడిపికొండకు చెందిన రైల్వే ఉద్యోగి గంగుల దేవేందర్‌రెడ్డి (56)కి కూతురు, కొడుకు ఉన్నారు. భార్య రాజ్యలక్ష్మి మూడు నెలల క్రితం మృతి చెందింది. కుమారుడు గంగుల భరత్‌కుమార్‌రెడ్డికి తిమ్మాపూర్‌కు చెందిన అమ్మాయితో ఆరు నెలల క్రితం వివాహం జరిగింది.

భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో భార్య తనకు అవసరం లేదు.. పుట్టింటికి వెళ్లిపోవాలని గొడవ చేస్తుండేవాడు భరత్. ఈ విషయమై ఆదివారం పెద్ద మనుషుల వద్ద పంచాయితీ జరిగింది. తండ్రి కల్పించుకొని కోడలును పుట్టింటింటికి పంపించి పరువు బజారున వేయకుండా బుద్ధిగా కాపురం చేసుకో కొడుకా అని మందలించాడు. దీంతో తండ్రిపై కోపం పెంచుకున్న భరత్‌కుమార్‌ రెడ్డి ఫిబ్రవరి 4వ తేదీన ఉదయం సుమారు మూడు గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న తండ్రి నోట్లో పుష్పగుత్తి పెట్టి బలవంతంగా పురుగుల మందు తాగించాడు.

A man kills his father in Warangal district

తెల్లవారుజామున పాలు అమ్మే వ్యక్తి గమనించి అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న దేవేందర్‌రెడ్డి మేనల్లుడికి సమాచారం అందించాడు. 108లో అతడిని ఎంజీఎంకు తరలించారు. అక్కడి నుంచి నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి మేనల్లుడు అటుకుల శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకకు కేసు నమోదు చేశారు పోలీసులు.

పంచనామా నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. కాగా శనివారం మధ్యాహ్నం గంగుల భరత్‌కుమార్‌రెడ్డి సైతం హసన్‌పర్తి మండలం అన్నసాగరం శివారులో పురుగుల మందు తాగి పడిపోగా స్థానికులు 108లో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు అక్కడే చికిత్స పొందుతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+