Free Bus: ఆర్టీసీ బస్సుల్లో సీట్లు లేక డిపో ముందు బైఠాయించిన వ్యక్తి..

ఆర్టీసీ బస్సుల్లో మహిళ ప్రయాణికలు సంఖ్య భారీగా పెరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్ ప్రయాణం సౌకర్యం కల్పించింది. దీంతో బస్సు ఎక్కే మహిళల సంఖ్య పెరిగింది. బస్సులో ఎక్కువ మంది మహిళలు ఉండడంతో మగవారికి సీట్లు దొరకడం లేదు. దీంతో వాసు అనే వ్యక్తి ఆర్టీసి బస్సులో మగవారికి సీట్లు కేటాయించాలని బస్సుల ముందు బైఠాయించాడు.

ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసి స్టాండ్ వద్ద జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో ఆడవారికి ఉచితంగా ఉన్నట్లుగానే మగవారికి కూడా ఉచితంగా ప్రయాణం కల్పించాలని బస్సుకు అడ్డంగా నిలబడ్డాడు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పించడంతో తమకు బస్సులో స్థలం దొరకగానే ఇబ్బంది పడుతున్నామని వాసు చెప్పాడు.

A man protested against allotting seats to men in RTC buses in Armur

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించడంతో ఆటోలో ఎక్కేవారి సంఖ్య తగ్గింది. దీంతో తమకు ఉచిత బస్ ప్రయాణం వల్ల నష్టం వాటిల్లుతుందని వాపోయారు. పలు చోట్లు ఆందోళనలు కూడా చేపట్టారు. అయితే పూర్తిగా ఉచితం కాకుండా 50 శాతం లేదా 25 శాతం రాయితీ ఇవ్వాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఉచితలు చాలా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. మరోవైపు కొంత మంది మహిళలు పని ఉన్నా లేకపోయినా ఫ్రీ బస్ కదా అని టైమ్ పాస్ కు జర్నీ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో ఎక్కడి వెళ్తున్నారని మహిళలను అడిగిత ఫ్రీ బస్ కదా అందుకే వెళ్తున్నామని చెబుతున్నారు. అవసరముంటేనే ఫ్రీ బస్సు వాడుకోవాలని సూచిస్తున్నారు. అనవసరంగా బస్సుల్లో ప్రయాణం చేస్తే మిగతా వారికి ఇబ్బంది అవుతుందని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+