అల్వాల్‌లో ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకటాపురం సాయినగర్ అపార్ట్‌మెంట్‌లో నివాసముండే వరుణ్ రావు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వరుణ్ రావు ఉజ్బెకిస్తాన్‌లో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు.
వరుణ్ రావు రెండు నెలల క్రితం సెలవుపై అల్వాల్‌కు వచ్చారని, శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలికి చేరుకున్న అల్వాల్ పోలీసులు.. వరుణ్ రావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వరుణ్ రావు మృతికి కారణం తెలియకపోవడంతో, అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

వేధింపులతోనే స్నేహితుడి హత్య
ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని అతని స్నేహితులు దారుణంగా హత్య చేసిన సంఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఖమ్మం జల్లాకు చెందిన శాంతయ్య, అనితకు ప్రశాంత్ ఏకైక కుమారుడు. తల్లితో కలిసి బాలాపూర్‌లో నివాసం ఉంటూ ఎంవీఎస్ఆర్ కాలేజీలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో బాలాపూర్ గణేశ్ చౌక్ వద్ద మండి 37 అరేబియన్ హోటల్ వద్ద ప్రశాంత్‌తో పాటు మరో ముగ్గురు యువకులు సిగరెట్లు తాగుతున్నారు.
ఈ క్రమంలో స్నేహితులకు, ప్రశాంత్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ముగ్గురు యువకులు ప్రశాంత్‌పై దాడి చేశారు. వారిలో ఓ యువకుడు తన వద్ద ఉన్న కత్తితో ప్రశాంత్ కడుపులో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ప్రశాంత్.. కింపడిపోగానే ముగ్గురు బైక్‌పై పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా అతడు అప్పటికే మృతిచెందాడు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హత్యచేసి పరారైన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరి ప్రియురాలిని బాధితుడు ఆన్‌లైన్‌లో వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ మృతితో అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.












Click it and Unblock the Notifications