ఎనిమిదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి: బాలికకు సవతి తల్లి చిత్రహింసలు
హైదరాబాద్: కన్న తల్లికి దూరమైన మైనర్ బాలికను కంటికి రెప్పలా చూసుకుంటానని చెప్పిన ఓ మహిళ ఆమె తండ్రిని రెండో వివాహం చేసుకుంది. అయితే భర్త ఇంట్లో లేని సమయంలో బాలికను తీవ్ర చిత్రహింసలకు గురిచేసింది. ఈ హృదయ విదారక సంఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం వెలుగుచూసింది.
పోలీసులు, నిందితురాలి భర్త రమేష్ కథనం ప్రకారం.. ఎల్బీనగర్ సర్కిల్, వనస్థలిపురం, శ్రీరామ హిల్స్‌కాలనీలో నివాసముంటున్న టి రమేష్(34), ప్రైవేట్ టీచర్. రమేష్‌కు మూడు సంవత్సరాల కూతురు ఉంది. కాగా, చిట్టిప్రోలు పుష్పలత(34) ప్రభుత్వ ఉద్యోగినిగా పనిచేస్తోంది. ఆమెకు ఎనిమిది సంవత్సరాలు బాలుడు ఉండగా భర్తకు విడాకులిచ్చి రమేష్‌ను రెండో పెళ్లి చేసుకుంది.
కొంతకాలంగా రెండో భార్య పుష్పలత, రమేష్ ఇంట్లో లేని సమయంలో కూతురును చిత్రహింసలు పెడుతోంది. దీంతో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. తండ్రి రమేష్ ఫిర్యాదు మేరకు రెండో భార్య పుష్పలతపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మైనర్ బాలికపై లైంగిక దాడి
బట్టలు కుట్టించుకోవడానికి వచ్చిన ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ టైలర్ లైంగిక దాడి చేసిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని ఇందిరానగర్‌లో నివాసముండే బాలిక(8) స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటోంది.
శుక్రవారం రాత్రి ఇంటికి సమీపంలో ఆడుకుంటున్న చిన్నారిని అదే దారిలో టైలరింగ్ షాపు నిర్వహించే దుర్గారావు(45) షాపులోకి పిలిచాడు. ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications