వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ లో కొత్త మార్పు - కోమటిరెడ్డికి వివరణ : ఛలో మునుగోడు..!!

|
Google Oneindia TeluguNews

టీపీసీసీ చీఫ్ రేవంత్ లో కొత్త మార్పు కనిపిస్తోంది. పరిస్థితిని చక్క దిద్దటానికి వివరణ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటి వరకు ఎవరు తన పైన కామెంట్స్ చేసినా..రేవంత్ సీరియస్ గా తీసుకోలేదు. కానీ, ఇప్పుడు మునుగోడు రాజకీయం నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలు..కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందనతో ఇప్పుడు వివరణ ఇచ్చారు. తాను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి మాత్రమే మాట్లాడానని.. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధం లేదని స్పష్టం చేసారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీలో సీనియర్ అని..ఆయన తెలంగాణ కోసం మంత్రి పదవిని సైతం వదులుకున్నారని చెప్పుకొచ్చారు.

Recommended Video

రాజగోపాల్ రెడ్డి రాజీనామా,ఎవరికి ఏ పార్టీ నచ్చితే అందులోకి మారతారు *Politics |
రేవంత్ రెడ్డి వివరణ

రేవంత్ రెడ్డి వివరణ

కోమటిరెడ్డి బ్రదర్స్ కుటుంబ బంధాల గురించి తాను మాట్లాడనని.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం కాంగ్రెస్ లో సైనికుడేనని చెప్పారు. తమ పార్టీలో స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారని.. మునుగోడులో పార్టీ కోసం వస్తారని పేర్కొన్నారు. ఈ రోజు జరిగే సభలోనూ ఆయన హాజరు కావాలని కోరుతున్నానని చెప్పుకొచ్చారు. రాజగోపాల్ రెడ్డి మాత్రం మద్యం షాపు పెట్టుకోవటానికి కూడా పనికి రారంటూ వ్యాఖ్యానించారు. తనకు - వెంకట రెడ్డి మధ్య అగాధం కలిగించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.

రాజగోపాల్ - వెంకటరెడ్డి వేర్వేరు

రాజగోపాల్ - వెంకటరెడ్డి వేర్వేరు

రాజ్ గోపాల్ రెడ్డి వేరు.. వెంకట్ రెడ్డి వేరని వివరించారు. వెంకట్ రెడ్డి తమ కుటుంబ సభ్యుడని పేర్కొన్నారు. రాజ్ గోపాల్ రెడ్డిని ద్రోహి గా అభివర్ణించారు. వెంకట్ రెడ్డి కి వివరణ ఇస్తున్నా...వెంకట్ రెడ్డి కి విజ్ఞప్తి చేస్తున్నా..అంటూ తాను చెప్పదలచుకున్నది చెప్పుకొచ్చారు. రాజగోపాల్ పైన చేసిన వ్యాఖ్యలకు వెంకటరెడ్డికి సంబంధం లేదని స్పష్టం చేసారు. బీజేపీ కాంట్రాక్టులు ఇచ్చి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు.

మునుగోడుకు ఆహ్వానం

మునుగోడుకు ఆహ్వానం

తెలంగాణా కు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన ఎన్నో ప్రాజెక్టులను బిజెపి ప్రభుత్వం తిరస్కరించిందని ఆరోపించారు. చెరుకు సుధాకర్ చేరిక తెలంగాణ ఉద్యమకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. బిజెపి, టీఆరెస్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతుందని రేవంత్ స్పష్టం చేసారు. కాంగ్రెస్ మునుగోడు సభలో చెరుకు సుధాకర్ పాల్గొంటారుని చెప్పారు. కాంగ్రెస్ తీసుకునే చర్యలను తెలంగాణ ప్రజలు ఆహ్వానించాలని రేవంత్ కోరారు. ఇప్పుడు రేవంత్ వివరణ..మునుగోడు ఆహ్వానం పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎలా స్పందిస్తారనేది చూడాలి.

English summary
PCC Chief Revanth given clarification for MP Komatireddy Venkata Reddy on his previous comments, new fight begin between TPCC leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X