Cyber Crime: క్యాష్ బ్యాక్ అంటూ ఫోన్.. రూ.4 లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి..
ఈ మధ్య సైబర్ క్రైమ్ లు భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా చదువుకున్న వారే సైబర్ క్రైమ్ బాధితులుగా ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తోన్న ఓ మహిళకు ఇన్ స్టాగ్రామ్ లో ఒకరు పరిచయం అయ్యారు. ఆ తర్వాత అతను ఇన్ స్టాగ్రామ్ పేజీలకు రేటింగ్ ఇస్తే మీకు డబ్బులు వస్తాయని ఆమెతో చెప్పాడు. ఇది నమ్మిన ఆమె రేటింగ్స్ ఇచ్చింది. దాని అతను డబ్బు కూడా పంపాడు. తర్వాత ఓ స్కీమ్ ఉంది మీరు పెట్టుబడి పెడితే డబ్బులు డబుల్ అవుతాయని నమ్మించాడు.
అది నమ్మిని మహిళా సాఫ్ట్ వేర్ లక్షల్లో డబ్బులు మోసం పోయింది. తాజాగా క్యాష్ బ్యాంక్ పేరుతో ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్లు రూ.4 లక్షలకు పైగా మోసం చేశారు. సైబరాబాద్ కు చెందిన ఓ వ్యక్తికి గత మార్చి 21న యాక్సిస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ అంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. మీకు క్రెడిట్ కార్డుపై రూ.4,500 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉందని చెప్పాడు. వచ్చే నెల బిల్లులో ఆ మొత్తాన్ని తగ్గిస్తామని నమ్మబాలికాడు. ఇది నిజమే అనుకున్న బాధితుడు బ్యాంక్ అకౌంట్ కు సంబంధించి వివరాలు ఇచ్చాడు.

ఇంకేముంది.. బాధితుడి బ్యాంక్ ఖాతా నుంచి పలు దఫాలుగా రూ.4 లక్షల 71 వేలు మాయమైయ్యాయి. ఇది సైబర్ క్రైమ్ అని గుర్తించిన బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. భూపేందర్, ఉత్తమ్, హిమాన్షు, సోను అనే ఢిల్లీకి చెందిన వారు ఈ మోసానికి పాల్పడ్డాట్లు గుర్తించారు. ఈ ముగ్గురిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. నిందితుల తెలంగాణలో 166 సైబర్ క్రైమ్ లకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
సైబర్ క్రైమ్ లు ప్రధాన కారణం మనిషి అత్యాశ. మహిళా సాఫ్ట్ వేర్ కు లక్షల్లో జీతం అయినా.. ఆమె డబ్బులు వస్తాయని ఇన్ స్టాగ్రామ్ పేజీలకు రేటింగ్స్ ఇచ్చింది. క్యాష్ బ్యాక్ కేసులో కూడా అవతలి వ్యక్తి క్యాష్ బ్యాక్ వచ్చిందని చెప్పగానే వెనక ముందు ఆలోచించకుండా బ్యాంక్ డిటైల్స్ ఇచ్చాడు. అతనికి క్యాష్ బ్యాక్ అనే మాట వినగానే ఆశతో ఏం ఆలోచించలేదు. అందుకే ఎవరు ఫోన్ చేసిన.. సోషల్ మీడియాలో అపరిచితులు పరిచయమైనా వారితో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications