Nizamabad: ఏడు నెలల పసి పాపను విక్రయించిన తల్లిదండ్రులు..!

శిశువును అమ్మకానికి పెట్టిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్‌లో కొంతమంది దుండగులు 7 నెలల చిన్నారిని విక్రయించేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న ఆర్మూర్ పోలీసులు శనివారం ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ప్రకటించారు. పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించారు. జిల్లాలోని నందిపేట్ మండలం సిద్ధాపూర్ కు చెందిన అంగేటి పోశెట్టి-లక్ష్మి దంపతులకు 7 నెలల క్రితం పాప పుట్టింది.

అయితే వారు శిశువును అమ్మకానికి పెట్టారు. వారం క్రితం పసి పాను విక్రయించారు. పెర్కింట్ కు చెందన షేక్ హబీబి, మహమ్మద్ గౌస్ దంపతులకు అమ్మినట్లు స్థానికంగా ప్రచారం జరిగింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో.. షేక్ హబీబి, మహమ్మద్ గౌస్ దంపతులను విచారించారు. తమకు పిల్లలు లేకపోవడంతో ఏడు నెలల చిన్నారి కొనుగోలు చేసినట్లు పోలీసుకు తెలిపారు. దీంతో పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు.

A seven-month-old female child was sold by her parents in Armur Nizamabad district

కొనుగోలు చేసిన వారి నుంచి చిన్నారిని తీసుకొచ్చి జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో ఉన్న ఐసీడీఎస్ బాలల కేంద్రంలో అప్పగించారు. పాప ప్రస్తుతం అధికారుల సంరక్షణలో ఉంది. పాప కొనుగోలుకు సంబంధించి సహకరించిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఆర్మూర్ ఏఎస్ఐ లక్ష్మణ్ తెలిపారు. చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు చేయడం నేరమన్నారు. ఇలాంటి పెనులు ఎవరు చేసినా నేరమన్నారు. కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

పిల్లలు లేని వారు చట్ట ప్రకారం దత్తాత తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఒక పద్ధతి ఉంటుందని వివరిస్తున్నారు. చట్ట ప్రకారం కాకుండా ఇల్లీగల్ గా పిల్లలను కొనుగోలు చేస్తే నేరమని చెప్పారు. కొద్ది నెలల క్రితం పిల్లలను విక్రయించే ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. అయితే వారు చాలా మందికి పిల్లలను విక్రయించారు. వారంతా పోలీస్ స్టేషన్ కు వచ్చి కన్నీరుమున్నీరు అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+