వ్యభిచార గృహాలపై దాడి, 30మంది యువతులకు విముక్తి: క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
హైదరాబాద్: మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో వ్యభిచార గృహాలపై తెలంగాణ సిఐడి పోలీసులు దాడి చేశారు. అక్కడ వ్యభిచార గృహాల్లో మగ్గుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 30మంది యువతులకు విముక్తి కలిగించారు.
బుధవారం తెలంగాణకు చెందిన సిఐడి బృందం ఈ దాడులను నిర్వహించింది. మహిళలను సాయంత్రం స్థానిక కోర్టులో హాజరుపర్చనున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, గురువారం 30మంది యువతులను హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పారు.

క్రికెట్ బెట్టింగ్ ముఠా పట్టివేత
హైదరాబాద్ నగరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ అంతర్ రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బెట్టింగ్ నిర్వహణపై సమాచారం అందుకున్న సౌత్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు షాహినాయిత్‌గంజ్, సుల్తాన్‌బజార్‌లో దాడులు చేసి 13 మందిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల వద్ద నుంచి పోలీసులు రూ. 26 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. సీపీ మహేందర్ రెడ్డి నిందితులను మధ్యాహ్నం మీడియా ముందు ప్రవేశపెట్టారు.












Click it and Unblock the Notifications