రంగారెడ్డి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం.. తాజాగా ఎవరంటే!!

|
Google Oneindia TeluguNews

రంగారెడ్డి : ఈ మధ్యకాలంలో టిఆర్ఎస్ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ అంచనాలను తలకిందులు చేస్తూ రాష్ట్రంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రత్యర్ధి పార్టీల వైపు చూస్తున్న అసంతృప్తుల జాబితా కూడా పార్టీలో పెరిగిపోతోంది. ఏకంగా కొందరు కారు దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది.

బడంగ్ పేట నగరపాలక సంస్థ మేయర్ కాంగ్రెస్ లో చేరుతున్నట్లుగా ప్రకటన

బడంగ్ పేట నగరపాలక సంస్థ మేయర్ కాంగ్రెస్ లో చేరుతున్నట్లుగా ప్రకటన

2018 ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, టిఆర్ఎస్ పార్టీ బాట పట్టిన చాలామంది నేతలు ఇప్పుడు, టిఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ నే బెస్ట్ అని భావించి సొంతగూటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో ఇటీవల కాలంలో చేరికలు జోరందుకున్నాయి. మొన్నటికి మొన్న పీజేఆర్ కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి టిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక తాజాగా హైదరాబాద్ శివారులోని బడంగ్ పేట నగరపాలక సంస్థ మేయర్ చిగిరింత పారిజాతా నరసింహారెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నట్లుగా ప్రకటించడం టిఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ అని చెప్పాలి.

ఆరుగురు కార్పోరేటర్లతో కలిసి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవటానికి రెడీ అయిన మేయర్

ఆరుగురు కార్పోరేటర్లతో కలిసి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవటానికి రెడీ అయిన మేయర్

పక్క పార్టీ కార్పొరేటర్ లను తమ పార్టీలోకి తీసుకురావడంలో పెట్టిన దృష్టి, సొంత పార్టీ నేతలు కారు దిగి బయటకు వెళ్తుంటే పెట్టలేకపోవడం టిఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా కనిపిస్తుంది. గులాబీ నేతలను పక్క పార్టీలలో చేరకుండా ఆపటంలో టీఆర్ఎస్ విఫలం అవుతుంది. తాజాగా బడంగ్ పేట నగరపాలక సంస్థ మేయర్ మరో ఆరుగురు కార్పొరేటర్ల తో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి వారిని ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నా ఆమె ప్రయత్నాలు ఫలించడం లేదని సమాచారం. తన రాజీనామా లేఖను ఆమె రంగారెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డికి మెయిల్ చేశారు.

 కాంగ్రెస్ లో చేరిక.. గులాబీ పార్టీకి రాజీనామా.. కారణం చెప్పిన బడంగ్ పేట మేయర్

కాంగ్రెస్ లో చేరిక.. గులాబీ పార్టీకి రాజీనామా.. కారణం చెప్పిన బడంగ్ పేట మేయర్


బడంగ్ పేట అభివృద్ధి కోసం అప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారని పార్టీలోని కొందరు తన ఎదుగుదల జీర్ణించుకోలేక, తన పట్ల వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని, పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనకు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయని పేర్కొన్న మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి, పార్టీలో ఉన్న కక్షసాధింపు రాజకీయాలను తట్టుకోలేక తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు తనకు సహకరించిన పార్టీ పెద్దలకు, నాయకులకు ధన్యవాదాలు చెప్పిన ఆమె తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

కాంగ్రెస్ లో చేరేందుకు తీగల కృష్ణా రెడ్డి రెడీ?

కాంగ్రెస్ లో చేరేందుకు తీగల కృష్ణా రెడ్డి రెడీ?

ఇదిలా ఉంటే తీగల కృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఇక వీరంతా రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరోపక్క గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వెళ్లిన సొంత పార్టీ నేతలతో రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని వారికి పిలుపునిస్తున్నారు. ఒకవేళ వారు రాకుంటే గతంలో వారిపై ఎన్నికల బరిలోకి దిగిన ప్రత్యర్థులను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

 టీఆర్ఎస్ లో అసంతృప్తులను టార్గెట్ చేస్తున్న రేవంత్ రెడ్డి

టీఆర్ఎస్ లో అసంతృప్తులను టార్గెట్ చేస్తున్న రేవంత్ రెడ్డి

టీఆర్ఎస్ పార్టీలో అసంత్రుప్తులకు రేవంత్ రెడ్డి గాలం వేస్తున్నారు. ఏది ఏమైనా పార్టీలో చేరికల విషయంలో బీజేపీతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముందుకు వెళుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వస్తున్న నేతలు కూడా బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీ వైపు దృష్టి సారించడం ఇటీవల కాలంలో ప్రధానంగా కనిపిస్తుంది. ఈ చేరికలు కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ నింపుతున్నాయి.

English summary
The momentum of joining Congress will continue. With the joinings, the party looks in josh. The Mayor of Badang Peta Municipal Corporation along with six corporators announced that they are joining the Congress. This is another shock for TRS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X