ఎండను తట్టుకోలేక ఫ్రిజ్ లో తలదాచుకొన్న పాము, చివరికిలా...
సిరిసిల్ల: వేసవి కాలంలో ఎండలకు తట్టుకోలేక ఉపశమనం కోసం అనేక ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కొంటున్నారు మనుషులే. అయితే మనుషులేకాదు పాములు కూడ ఎండలకు భరించలేక చల్లదనాన్ని కోరుకొంటున్నాయి.
చల్లధనం కోసం ఓ పాము ప్రిజ్ లో తలదాచుకొంది.ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకొంది. ప్రిజ్ లో పెట్టిన సరుకులను తీసుకొనేందుకు తలుపు తీస్తే పామును చూసిన ఇంటి యజమాని భయపడిపోయాడు.
సిరిసిల్ల పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ప్రిజ్ లోకి పాము దూరింది. ప్రిజ్ కు వెనుక వైపున ఉన్న రంద్రం ద్వారా ప్రిజ్ లోకి పాము ప్రవేశించింది.

అయితే ప్రిజ్ లో పెట్టిన బాటిల్ ను తీసుకొనేందుక ప్రయత్నించిన ఆ వ్యక్తి పామును చూసి భయంతో కంపించిపోయారు.దీంతో వెంటనే ఆయన పాములు పట్టే వ్యక్తికి తీసుకు వచ్చాడు.
చల్లదనం కోసం ప్రిజ్ లో తలదాచుకొన్న పామును పాములు పట్టే వ్యక్తి బయటకు తీశాడు, దీంతో పాము ప్రిజ్ నుండి వెళ్ళిపోవడంతో వారు ఊపిరి పీల్చుకొన్నారు.












Click it and Unblock the Notifications