సెల్‌ఫోన్ కోసమేనా? హాస్టల్‌లో విద్యార్థుల ఘర్షణ: ఓ విద్యార్థి మృతి

ఖమ్మం: ప్రభుత్వ గిరిజన ఆశ్రమ వసతి గృహంలో విషాద ఘటన చోటు చేసుకుంది. విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఓ విద్యార్థి ప్రాణాన్ని బలిగొంది. ఈ ఘటనలో నాలుగో తరగతి విద్యార్థి ఒకరు మృతిచెందారు.

వసతి గృహంలోని నాలుగు, పదో తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో నాలుగో తరగతి విద్యార్థి జోసెఫ్‌ (10) మృతిచెందాడు.

A student killed in a hostel in Khammam

పదో తరగతి విద్యార్థి ఒకరు దాడి చేయడంతో జోసెఫ్‌ మృతి చెంది ఉంటాడనే అనుమానంతో ఆ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జోసెఫ్‌ మృతదేహాన్ని ఓ పెట్టెలో పెట్టినట్లు సమాచారం.

వార్డెన్‌ ప్రతాప్‌ సింగ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన నేపథ్యంలో వసతిగృహం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థుల మధ్య సెల్ విషయంలో గొడవ జరిగినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+