లండన్: అనుమానాస్పద స్థితిలో టెక్కీ భార్య స్వాతి మృతి, హత్యేనా?
వరంగల్ జిల్లాలోని హన్మకొండకు చెందిన స్వాతి లండన్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాగా, అత్తింటివారే స్వాతిని హత్య చేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గత కొంత కాలం క్రితం స్వాతికి..
వరంగల్: జిల్లాలోని హన్మకొండకు చెందిన స్వాతి లండన్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాగా, అత్తింటివారే స్వాతిని హత్య చేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గత కొంత కాలం క్రితం స్వాతికి.. హన్మకొండకు చెందిన రాజేష్‌తో వివాహం జరిగింది.
కాగా, రాజేష్ లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. వివాహం అనంతరం స్వాతిని కూడా రాజేష్ లండన్ తీసుకెళ్లాడు. అయితే, నిశ్చితార్థం జరిగినప్పటి నుంచే వరకట్నం కోసం స్వాతిని రాజేష్, అతని కుటుంబసభ్యులు వేధించారని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు.

పెళ్లైన తర్వాత కూడా మానసికంగా, శారీరకంగా హింసించి స్వాతిని చంపేశారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ స్వాతి కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. కాగా, స్వాతి మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications