తెలుగు రాష్ట్రాల్లో ఘోర విషాదం.. ఆ కారణంతో ఒకేరోజు తొమ్మిది మంది మృతి
తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ( జూన్ 8, 2025 ) తీవ్ర విషాదకర విషాదకర సంఘటనలు చోటుచేసుకున్నాయి. తెలంగాణ, ఏపీలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రెండు ప్రమాదాల్లో మొత్తం తొమ్మిది మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విచార ఘటనలతో వారి కుటుంబాల్లో తీరని దుఃఖం అలుముకుంది.
తెలంగాణలో ఆరుగురు మృతి..
ఈ ఘటనలకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి నదిపై ఉన్న మేడిగడ్డ బ్యారేజీ వద్ద శనివారం స్నానానికి వెళ్లి గల్లంతైన ఆరుగురు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులను మధుసూదన్ (18), పి. శివ మనోజ్ (15), రక్షిత్ (13), కర్నాల సాగర్ (16), రామ్ చరణ్ (18), పి. రాహుల్ (19)గా గుర్తించారు. చనిపోయిన వారంతా అంబటిపల్లి, కొర్లకుంట గ్రామాలకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన బంధువులుగా గుర్తించారు.

మొత్తం ఎనిమిది మంది బంధువులు వివాహ విందుకు హాజరై తర్వాత సమీపంలోని మేడిగడ్డ బ్యారేజీ వద్దకు స్నానానికి వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు వారు నీటిలో మునిగిపోతుండగా.. వెంకటస్వామి, మరో వ్యక్తి సురక్షితంగా బయటపడ్డారు. అయితే మృతుల్లో మధుసూదన్, మనోజ్.. వెంకటస్వామి కుమారులుగా గుర్తించారు. తొలుత ఇద్దరు బాలురు నీటిలో మునిగిపోతుండగా.. వారిని కాపాడేందుకు మిగతా వారు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయినట్టు వాపోతున్నారు.
ఏపీలో ముగ్గురు మృతి..
ఇక తెలంగాణలో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా మరో విషాద ఘటన చోటుచేసుకుంది. డుంబ్రిగూడ మండలం గుంటసీమ లోని ఓ చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు పదో తరగతి విద్యార్థులు నీట మునిగి మరణించారు. మృతులను కె. సుశాంత్, జి. భాను తేజం, సాయి కిరణ్‌గా గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ రెండు ఘటనలతో తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications