వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారంలో ఇధ్దరు చిన్నారుల మృతి,భార్యపైనే భర్త అనుమానం..అందుకేనా?

అల్లారు ముద్దుగా పెంచుకొన్న ఇద్దరు పిల్లలు వారం వ్యవధిలోనే చనిపోయారు.అయితే ఈ పిల్లల మరణానికి తన భార్యే కారణమని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

నిజామాబాద్:అల్లారు ముద్దుగా పెంచుకొన్న ఇద్దరు పిల్లలు వారం వ్యవధిలోనే చనిపోయారు.అయితే ఈ పిల్లల మరణానికి తన భార్యే కారణమని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకొంది.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఆలూరు గ్రామానికి చెందిన కొక్కు గోపాల్ కు పదేళ్ళక్రితం రాయికల్ మండలకేంద్రానికి చెందిన సింగు స్రవంతితో వివాహమైంది.వీరికి ఆరేళ్ళ వైష్ణవి,మూడేళ్ళ వైష్ణవి అనే ఇద్దరు కూతుళ్ళున్నారు.

గోపాల్ ముంబాయిలో దర్జీగా పనిచేస్తున్నాడు. ఈ ఏడాది జనవరి 29వ,తేదిన చిన్న కూతురు అమూల్యతో పాటు రాయికల్ కు వచ్చింది స్రవంతి.జనవరి 31వ, తేదిన చిన్నారి అమూల్య రాయికల్ లోని ఇంట్లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది.

a three year old children died in nizamabad

ఈ విషయం తెలిసిన గోపాల్ ముంబాయి నుండి స్వగ్రామానికి వచ్చాడు.ఇదే రీతిలో తన పెద్దకూతురు వైష్ణవి కూడ గత నెల 25వ, తేదిన ముంబాయిలో చనిపోయిందని గోపాల్ చెరప్పాడు.

ఈ విషయమై ముంబాయి ధామ్ పెల్లి రామ్ నగర్ ఠాణాలో తన భార్యపై ఫిర్యాదు చేసినట్టు గోపాల్ చెప్పాడు. పెద్ద కూతురు చనిపోయినట్టుగానే తన చిన్న కూతురు కూడ చనిపోయిందని గోపాల్ చెబుతున్నారు.

మతిస్థిమితం సరిగా లేని తన భార్య పిల్లలను చంపుతానని బెదిరించేదని గోపాల్ చెప్పాడు. తన ఇద్దరు కూతుళ్ళ మరణానికి తన భార్యే కారణమని ఆయన ఆరోపిస్తున్నాడు.

ఈ విషయమై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుటుంబంలో ఏమైనా సంఘటనలు చోటుచేసుకొన్నాయా అనే కోణంలో కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు.

English summary
A three year old children died in nizamabad. gopal working as a tailor in mumbai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X