Hyderabad Dogs Attack: మహిళపై 15 కుక్కల దాడి.. వీడియో వైరల్..!
జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో హైదరాబాద్ ప్రజలు గాయాల పాలు అవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ వీధి కుక్కల దాడులు భారీగా పెరిగిపోయాయి. హైదరాబాద్ లోనే కాదు రాష్ట్రంలో కూడా కుక్కల దాడులు పెరిగాయి. హైదరాబాద్ లో సంవత్సరం క్రితం అంబర్ పేటలో వీధి కుక్కలు బాలుడిపై దాడి చేసి చేంపేశాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ విషయమై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
దీంతో జీహెచ్ఎంసీ అధికారులు వీధి కుక్కల కట్టడికి తూతుమంత్రంగా చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ వీధి కుక్కల దాడులు పెరిగాయి. మనుషులపై కుక్కలు దాడులు చేస్తున్న ఎన్నో వీడియోలు బయటకు వచ్చాయి. అయినా కూడా కుక్కల కట్టడికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. తాజాగా ఓ మహిళపై దాదాపు 15 వీధి కుక్కలు దాడి చేసే ప్రయత్నం చేశాయి. ఈ ఘటన హైదరాబాద్ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటనలో మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది.

ఈ ఘటన చిత్రపురి కాలనీలో జరిగింది. చిత్రపురి కాలనీలో నడుచుకుంటూ వెళ్తోన్న మహిళపై వీధికుక్కలు దాడికి యత్నించాయి. చుట్టుముట్టిన వీధి శునకాల బారి నుంచి తప్పించుకునేందుకు మహిళ ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో మహిళ కిందపడిపోయింది. ఆ తర్వాత లేచి కుక్కలను కొట్టే ప్రయత్నం చేసింది. చివరికి ఓ ద్విచక్రవాహనదారుడు కుక్కలను తరమడంతో మహిళ ప్రాణాలతో బయట పడింది. ఈ దృశ్యాలన్ని అక్కడ అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
సీసీటీవీ ఫుటేజ్
— Telugu Scribe (@TeluguScribe) June 22, 2024
దారుణం.. మహిళపై 15 కుక్కల దాడి
మణికొండలోని చిత్రపురి హిల్స్ వద్ద ఓ మహిళపై దాదాపు 15 కుక్కలు దాడి చేశాయి.
ఈ ప్రాంతంలో చాలా మంది పిల్లలపై కుక్కలు దాడి చేశాయని, GHMC ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని నివాసితులు ట్విటర్ వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. pic.twitter.com/O452O8SIpQ
వీధి కుక్కలను కట్టడి చేయాలని జీహెచ్ఎంసీ అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటీవల మియాపూర్‌లోని మక్తాలోని డంప్‌యార్డు వద్ద ఆరేళ్ల బాలుడిని వీధి కుక్కలు కొరికి చంపాయి. ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.












Click it and Unblock the Notifications