కట్న వేధింపులు: బిడ్డను నీటి సంపులో పడేసి, నిప్పంటించుకుని తల్లి ఆత్మహత్య
నల్గొండ: అదనపు కట్నం కోసం వేధింపులు, కుటుంబకలహాలతో జీవితంపై విరక్తి చెందిన ఓ మహిళ.. తన కన్నబిడ్డను నీటి సంపులో పడవేసి.. ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విధారకర ఘటన జిల్లాలోని భువనగిరి మండలం గౌస్‌నగర్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం తంగెడపల్లి గ్రామానికి చెందిన చీగూరి స్వరూప, యాదయ్య పెద్దకుమార్తె మమత(23)ను భువనగిరి మండలం గౌస్‌నగర్‌కు చెందిన నల్లమాస భాస్కర్‌తో 2014ఏప్రిల్ 20న పెద్దలు వివాహం జరిపించారు.

కాగా, మద్యానికి బానిసైన భాస్కర్.. పెళ్లైన నాటి నుంచి రోజూ భార్యను వేధింపులు గురిచేసేవాడు. అదనపు కట్నం తీసుకురామ్మంటూ ఆమెను హింసించేవాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన మమత ఆదివారం తెల్లవారుజామున 2.30గంటలకు తన కుమార్తె భాను(5నెలలు)ని ఇంట్లోని నీటి సంపులో పడవేసి.. పక్కనే మరుగు దొడ్డిలోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.
మంటలు తాళలేక ఇంటి ఎదుట కొట్టంలోకి పరుగులు తీసింది. దీంతో కొట్టానికి మంటలు అంటుకుని పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో మమత అక్కడికక్కడే మృతి చెందింది. ఈ క్రమంలో అత్తమామలు నల్లమాస లింగమ్మ, వెంకటయ్య, భర్త భాస్కర్ హడావుడిగా ఇంటికి తాళంవేసి పరారవుతుండగా.. గమనించిన స్థానికులు అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూశారు.
నీటి సంపులో ఉన్న చిన్నారి మృతదేహాన్ని బయటకు తీసి.. ఇంటి ఎదుట కొట్టంలో కాలిన గాయాలతో మమత మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. భువనగిరిరూరల్ సీఐ అర్జునయ్య, ఎస్‌ఐ సాజి దుల్లా సంఘటనా స్థలానికి చేరుకుని, ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
అనంతరం మృతదేహాలకు భువనగిరి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యా ప్తు చేస్తన్నట్లు ఎస్‌ఐ సాజిదుల్లా తెలిపారు. కాగా, తమ కుమార్తెను భాస్కర్‌గౌడ్ హత్యచేశారని మృతురాలి తల్లి దండ్రులు స్వరూప, యాదయ్యలు ఆరోపించారు. కొన్ని నెలల నుంచి అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని తెలిపారు. తమ కుమార్తెకు ఫోన్ చేయకుండా నంబర్లను బ్లాక్ లిస్టులో పెట్టాడని, పెద్దలతో పంచాయితీ ఏర్పాటు చేయడంతో కక్ష కట్టి తల్లి, బిడ్డలను హతమార్చాడని వారు కన్నీరుమున్నీరయ్యారు.












Click it and Unblock the Notifications