ఉన్మాది ఘాతుకం: కోరిక తీర్చలేదని సహోద్యోగిని గొంతుకోశాడు
నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండల పరిధిలోని వెలమలపల్లి గేట్ సమీపంలోని దొంతులగుట్ట తాండా దగ్గర శుక్రవారం దారుణ ఘటన చోటు చేసుకుంది.
నాగర్‌కర్నూలు: నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండల పరిధిలోని వెలమలపల్లి గేట్ సమీపంలోని దొంతులగుట్ట తాండా దగ్గర శుక్రవారం దారుణ ఘటన చోటు చేసుకుంది.
స్నేహితుల ఇంటికి వెళ్దామని యువతిని నమ్మించిన ఓ దుర్మార్గుడు.. మార్గమధ్యంలో గుట్టల్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించాడు. యువతి ప్రతిఘటించడంతో ఆ కిరాతకుడు గొంతుకోసి పరారయ్యాడు.
వివరాలిలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం పిల్లికుంట్ల తండాకు చెందిన రాజేశ్వరి(20) మండల కేంద్రం సమీపంలోని బటర్‌ఫ్లె సిటీ అనే కంపెనీలో కూలీగా పనిచేస్తోంది. అదే మండలం దాసర్లపల్లికి చెందిన మేఘావట్ నరేశ్ అదే కంపెనీలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు.

శుక్రవారం మధ్యాహ్నం నరేశ్ స్నేహితుల ఇంటికి వెళ్దామని చెప్పి రాజేశ్వరిని తీసుకొని ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిపై నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం వెలుమలపల్లి గేటు దాటిన తర్వాత గుట్టల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు.
యువతి ప్రతిఘటించడంతో కత్తితో ఆమె గొంతుకోసి పరారయ్యాడు. కాగా, సమీప పొలాల్లో పనులు చేసుకుంటున్నరైతులు... యువతి అరుపులు విని అక్కడికి చేరుకున్నారు. రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతుండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
వంగూరు ఎస్‌ఐ వీరబాబు తన సిబ్బందితో సంఘటనాస్థలానికి చేరుకొని యువతిని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications