వేధింపులు: భవనంపై నుంచి దూకి వివాహిత ఆత్మహత్య
అత్తా, మామ, భర్త వేధింపులతో మనస్థాపం చెంది ఇల్లందుల నీరజ (38) అనే మహిళ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
వరంగల్: అత్తా, మామ, భర్త వేధింపులతో మనస్థాపం చెంది ఇల్లందుల నీరజ (38) అనే మహిళ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సుబేదారి సీఐ సతీష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మికుంటకు చెందిన నీరజను సుమారు 18యేళ్ల క్రితం హన్మకొండ అడ్వక్స్ కాలనీకి చెందిన ఇల్లందుల మనోహర్, అనసూయ దంపతుల కుమారుడు సురేష్‌కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు.
భర్త సురేష్ బిల్డర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. కొద్ది రోజుల తర్వాత వీరి కుటుంబం ఆర్థికంగా నష్టపోవడంతో కుటుంబంలో గొడవలు తలెత్తాయి. వీరు కొద్ది రోజులపాటు అడ్వక్స్ కాలనీలో ఉండే ఇల్లు వదిలి వేరే చోట అద్దెకు ఉన్నారు. కాగా, అక్కడ మృతురాలు నీరజ మానసిక పరిస్థితి బాగాలేదని కొంతకాలంగా సైక్రియార్టిస్ట్ వద్ద మందులు వాడుతున్నట్లు తెలిపారు.

తొమ్మిది సంవత్సరాల క్రితం నీరజ ఒకసారి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఈక్రమంలో 2015 నుంచి అత్తా మామలు ఉంటున్న ఇంట్లోనే ఉంటున్నారు. కాగా, నీరజ మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్ల మంగళవారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో వీరు ఉంటున్న బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
వెంటనే ఆమెను 108 సహాయంతో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. నీరజ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. తమ అక్కను డబ్బుల కోసం వేధించడంతోనే చనిపోయిందని మృతురాలి సోదరుడు యంసాని చంథ్రేఖర్ సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications