పిచ్చిది.. ట్రాక్ పై కారును పరుగులు పెట్టించింది: శంకర్ పల్లి వద్ద భయభ్రాంతులు: రైళ్ల రాకపోకలకు విఘాతం
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి వద్ద దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. ఓ యువతి.. పట్టాలపై కారును పరుగులు పెట్టించింది. 80 కిలోమీటర్ల వేగంతో కారు పరుగులు తీసింది. రైల్వే సిబ్బంది హెచ్చరిస్తోన్నప్పటికీ ఆమె లెక్క చేయలేదు. ఈ ఘటన ఆందోళనకు దారి తీసింది.
ఈ తెల్లవారు జామున ఈ ఘటన సంభవించినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సమాచారం అందిన వెంటనే రైల్వే భద్రత సిబ్బంది, స్థానిక పోలీసులు.. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. కారును స్వాధీనం చేసుకున్నారు.

సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోకి వస్తుందీ శంకర్ పల్లి రైల్వే స్టేషన్. శంకర్‌పల్లి- నాగులపల్లి సెక్షన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపుగా మూడు కిలోమీటర్ల పాటు ఆ యువతి కారును వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయింది. రైల్వే సిబ్బంది హెచ్చరిస్తోన్నప్పటికీ లెక్క చేయలేదు.
శంకర్ పల్లి వద్ద గల రైల్వే గేటు మీదుగా ఆ యువతి కారులో రైలు పట్టాలపై వచ్చినట్లు తెలుస్తోంది. మార్గమధ్యలో ఆమెను గమనించిన స్థానికులు శంకర్ పల్లి, నాగులపల్లి స్టేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీనితో హుటాహుటిన సిబ్బంది అప్రమత్తం అయ్యారు. కారును వెంబడించారు.
కారును ఆపాలంటూ హెచ్చరించినప్పటికీ ఆమె పట్టించుకోలేదు. చివరికి నాగులపల్లి వద్ద పట్టాలపైనే కారును అడ్డగించారు. దీన్ని సీజ్ చేశారు. దాదాపుగా గంట పాటు ఆ యువతి పట్టాలపై హల్ చల్ చేసినట్లు చెబుతున్నారు. ఈ ఘటనతో ఈ మార్గంలో రైళ్లను నిలిపివేయాల్సి వచ్చింది. బెంగళూరు- కాచిగూడ సహా వివిధ రైళ్లను సమీప స్టేషన్లల్లో ఆపివేశారు.
ఫలితంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆ యువతిపై ఎటువంటి కేసులు నమోదు చేశారనేది ఇంకా తెలియరావట్లేదు. రైల్వే ఆస్తులను ముప్పు వాటిల్లేలా వ్యవహరించినందు వల్ల సంబంధిత సెక్షన్ల ఆధారంగా ఆమెపై కేసు నమోదు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications