Online Game: ఆన్‍లైన్ గేమ్ ఆడి రూ.8 లక్షలు పోగొట్టుకున్న గృహిణి.. చివరికి ఇద్దరు పిల్లల్ని చంపి, తానూ..!
ఆన్‍లైన్ గేమ్ లకు పిల్లిలలే కాదు పెద్దలు కూడా ఆకర్షితులవుతున్నారు. గేమ్ లకు ఆకర్షితులవ్వడమే కాదు.. లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ గృహిణి ఆన్ గేమ్ లకు అలవాటు పడి లక్షల్లో డబ్బు కోల్పోయింది. చివరికి బిడ్డలను చంపి.. తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది.
వలిగొండ మండలం గొల్నేపల్లికి చెందిన అవిశెట్టి మల్లేశంకు అతని భార్య రాజేశ్వరీ, కుమారులు, అనిరుధ్, హర్షవర్ధన్ ఉన్నారు. మల్లేశం లారీ డ్రైవర్ గా పని చేస్తుండడంతో వారు చౌటుప్పల్ లోని మల్లికార్జునగర్ లో వారు ఇల్లు అద్దెకు తీసుకుని నివాసిస్తున్నారు.మల్లేశం లారీ డ్రైవర్ కావడంతో ఎక్కువగా బయటే ఉండేవాడు. దీంతో రాజేశ్వరీ పిల్లలతో ఉండేది. ఈ క్రమంలో రాజేశ్వరి తన ఫోన్ లో ఆన్ గేమ్ ఆడాడం అలవాటు అయింది.

ఆమె ఏడాదిగా ఆన్ లైన్ గేమ్ లకు బానిసై.. దాదాపు రూ.8 లక్షల రూపాయలు పోగొట్టుకుంది. ఇదంతా ఆమె భర్తకు తెలియకుండా చేసింది. రాజేశ్వరీ ఆ డబ్బంతా తెలిసిన వ్యక్తులు, బంధువుల వద్ద అప్పుగా తీసుకుంది. వారంతా అప్పు తిరిగి చెల్లించాలని కోరడంతో రాజేశ్వరీ ఆందోళన చెందింది. కొంత మంది మంగళవారం సాయంత్ర ఇంటికొచ్చి రాజేశ్వరీ, ఆమె భర్త మల్లేశంను నిలదీశారు. భూమి అమ్మి అప్పు చెల్లిస్తానని చెప్పిన వారు వినలేదు.
ఆవేదన చెందిన మల్లేశం ఇంటి నుంచి బయటకి వెళ్లాడు. తీవ్ర ఆందోళనకు గురైన రాజేశ్వరీ ఆత్మహత్య చేసుకుంది. అంతకుముందు తన ఇద్దరు కుమారులను నీటిసంపులో వేసి హత్య చేసింది. రాత్రి మల్లేశం ఇంటికి వచ్చాడు. అయితే భార్యా పిల్లలు కనిపించలేదు. సంపు మూతు తెరిచి ఉండడంతో వెళ్లి చూశాడు. అందులో భార్యతో పాటు పిల్లలు విగతజీవులుగా పడి ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications