భర్తను వదిలేసి ప్రియుడితో వెళ్ళిన వివాహితకు షాక్, కారణమిదే!

Posted By:
Subscribe to Oneindia Telugu

ల్వశ్రీరాంపూర్: ప్రియుడు తనను బాగా చూసుకొంటాడని నమ్మి కట్టుకొన్న భర్తను వదిలేసి వెళ్ళిన యువతికి ప్రియుడు చుక్కలు చూపించాడు. పెళ్ళికి పెద్దలు ఒప్పుకోవడం లేదంటూ ముఖం చాటేశాడు.అయితే దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకొంది.

పెద్దపల్లి జిల్లాలోని పెద్దంపేట గ్రామానికి చెందిన పోలుదాసరి జ్యోతిని అదే గ్రామానికి చెందిన పెద్దు శివకుమార్ పెళ్ళిచేసుకొంటానని శారీరకంగా లోబచర్చుకొన్నాడు. అయితే వీరిద్దరి కులాలు వేరుకావడంతో శివకుమార్ తల్లిదండ్రులు పెళ్ళికి ఒప్పుకోలేదు.

A woman protest infront of lover's house in Kaluvasrirampur

అయితే జ్యోతి తల్లి చనిపోవడంతో తండ్రి ఓదెలు ఆమెను పెంచాడు.అయితే బంధువులు, గ్రామస్థుల సహాయంతో జ్యోతిని వేరే వ్యక్తికి ఇచ్చి ఇటీవలే వివాహం చేశారు. అయితే జ్యోతికి వివాహమైన తర్వాత కూడ అత్తగారింటికి వెళ్ళిన జ్యోతిని శివకుమార్ తరచూ రమ్మని ఫోన్ చేసేవాడు.

అయితే భర్తతో కాపురం చేయలేక ప్రియుడి కోసం సిద్దంపేటకు చేరుకొంది జ్యోతి. అయితే సిద్దంపేటకు చేరుకొన్న జ్యోతికి ప్రియుడు ముఖం చాటేశాడు. తమ తల్లిదండ్రులు పెళ్ళికి ఒప్పుకోవడం లేదంటూ శివకుమార్ మాత్రం ముఖం చాటేశాడు. శివకుమార్ తో జీవిస్తానని జ్యోతి తేల్చి చెప్పింది. అయితే శివకుమార్ ఇంటిముందు జ్యోతి ధర్నాకు దిగింది.అయితే తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరుతోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman protest infront of lover's house in Kaluvasrirampur village at Peddapally district. Shivakumar, jyothi lovers. but jyothy married another woman. shivakumar cheated her. so she protest infront of shivakumar's house.
Please Wait while comments are loading...