Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తనను కాదని వేరే పెళ్లి చేసుకుంటుందని .. నల్గొండ జిల్లాలో బ్లేడ్ తో యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది

తెలుగు రాష్ట్రాల్లో ప్రేమోన్మాదుల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి . నిత్యం ఎక్కడో ఒక చోట ప్రేమ పేరుతో ఉన్మాదం పేట్రేగిపోతోంది. మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టపగలు నడిరోడ్డుపై రమ్య అనే బీటెక్ విద్యార్థినిని ప్రేమోన్మాది అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హతమార్చిన ఘటన తెలిసిందే. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్రంలోనూ తనను ప్రేమించే లేదన్న కోపంతో ఓ ప్రేమోన్మాది నడిరోడ్డు మీద యువతిపై విచక్షణారహితంగా దాడి చేశాడు.

నల్గొండ జిల్లాలో ఘాతుకం .. బ్లేడ్ తో యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళితే నేరేడుచర్ల మండలం రాజీవ్ నగర్ కాలనీలో స్థానికంగా నివాసం ఉంటున్న ఓ యువతిపై బాల సైదులు అనే యువకుడు బ్లేడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు . విచక్షణా రహితంగా ఆమె గొంతు పై బ్లేడుతో అనేకమార్లు దాడిచేశాడు. తనని ప్రేమించలేదు అన్న ఒకే ఒక్క కారణంతో ఆమెపై కక్ష పెంచుకున్న బాల సైదులు రోడ్డు వెంబడి ఒంటరిగా నడిచి వెళుతున్న క్రమంలో ఊహించని విధంగా యువతి పై ఎటాక్ చేసాడు. ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే బ్లేడ్ తో ఆమె గొంతును కోశాడు.

A young man attacked with a blade on a young woman of love rejection in Nalgonda district

తనను కాదని వేరే పెళ్లి చేసుకుంటుందన్న కోపంలో దారుణం
ఇక ఈ సంఘటనను చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ప్రేమోన్మాది చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి, తీవ్ర రక్తస్రావం అవుతున్న యువతి పరిస్థితి విషమంగా మారడంతో 108 వాహనంలో యువతిని మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. యువతిని వెంటపడుతూ తరచూ ప్రేమిస్తున్నానని ఆ యువకుడు వేధిస్తున్నాడని, ఇటీవల సదరు యువతికి పెళ్లి సంబంధం కుదిరిందని, ఈ క్రమంలో కోపం పెంచుకున్న ప్రేమోన్మాది తనను కాదని వేరే వారిని పెళ్లి చేసుకుంటుంది అన్న కోపంలో ఆమెపై ఉన్మాద చర్యకు పాల్పడ్డాడని ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం పోలీసులు భావిస్తున్నారు.

యువతి పరిస్థితి విషమం ... నిందితుడి కోసం గాలింపు
యువతిపై అత్యంత పాశవికంగా దాడికి పాల్పడిన నిందితుడు దాడి చేసిన అనంతరం పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, పారిపోయిన నిందితుడు కోసం గాలింపు చేపట్టారు. ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపి ప్రేమోన్మాది కోసం గాలిస్తున్నారు. ఇక ఆసుపత్రిలో యువతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. యువతి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన తమ బిడ్డకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు.

కేవలం ప్రేమించలేదని జరుగుతున్న దారుణాలు .. సమాజానికి హానికరంగా వరుస ఘటనలు
కేవలం ప్రేమించ లేదన్న కోపంతో తెలుగు రాష్ట్రాల్లో యువతులపై జరుగుతున్న దాడులు సమాజంలో ఆందోళనకర పరిస్థితులకు కారణమవుతున్నాయి. ఇటు బాధిత యువతుల కుటుంబాలలోనే కాకుండా, ప్రేమ పేరుతో దాడులకు పాల్పడుతున్న యువకులు సైతం భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మార్చుకుంటున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి కేసులను త్వరితగతిన విచారణ జరిపి దోషులకు శిక్ష పడేలా చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిందితులకు శిక్ష పడితే తప్పా వారికి భయం కలగదని మహిళలు పేర్కొంటున్నారు. ఏదిఏమైనా సమాజానికి హానికరంగా మారుతున్న ఇలాంటి ఘటనలపై, ఈ ఘటనలకు గల కారణాలపై దృష్టిసారించి, వీటికి చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+