పట్టపగలే నడిరోడ్డుపై యువతిని కత్తితో నరికి చంపాడు: ప్రేమ వ్యవహారమే కారణం

హైదరాబాద్: పట్టపగలే నడిరోడ్డుపై ఓ యువకుడు యువతిని కత్తితో దారుణంగా నరికి హత్య చేశాడు. ఈ దిగ్భ్రాంతికర ఘటన నిర్మల్​ జిల్లా ఖానాపూర్‌​లోని శివాజీ నగర్​‌లో చోటు చేసుకుంది. ఈ దాడిలో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దాడిని అడ్డుకున్న ఆమె వదిన, రెండేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. దాడి చేసిన అనంతరం యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

స్థానికులు గాయపడిన వీరిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, దర్యాప్తును ప్రారంభించారు. ఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్​ పట్టణంలోని అంబేడ్కర్​ నగర్​ కాలనీకి చెందిన సీహెచ్​ సోనీ(20) అనే యువతి టైలరింగ్​‌ నేర్చుకునేందుకు టైలర్ షాప్‌కు వెళ్లింది.

A youth murdered young woman in khanapur, Nirmal district

టైలరింగ్​ షాపు నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఓ యువకుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. వెంటనే దాడిని అడ్డుకోబోయిన ఆమె వదిన, పక్కనే ఉన్న రెండేళ్ల చిన్నారిపై కూడా విచక్షణరహితంగా దాడికి తెగబడ్డాడు నిందితుడు. యువకుడు జరిపిన దాడిలో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఆమె వదినకు తీవ్ర గాయాలు అయ్యాయి. బాలుడి తలకు గాయాలయ్యాయి.

దాడి చేసిన అనంతరం యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడిని గమనించిన స్థానికులు వెంటనే గాయపడిన వారిరువురిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. యువతిపై ఆ యువకుడి దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

అలేఖ్యను గత కొంత కాలం నుంచి నిందితుడు శ్రీకాంత్ ప్రేమిస్తున్నాడని.. ఈ క్రమంలోనే తనతో పెళ్లికి నిరాకరించడంతోనే ఈ దారుణానికి తెగపడ్డాడని పోలీసులు తెలిపారు. అడ్డువచ్చిన ఆమె వదిన జయశ్రీ, ఆమె కుమారుడిపై దాడి చేయడంతో గాయాలయ్యాయి. కాగా, ప్రేమికుల రోజుకు వారం రోజుల ముందు ఈ దారుణం జరగడం శోచనీయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+