ఆరా మస్తాన్ సర్వే.. జూబ్లీహిల్స్ ఆ పార్టీదే.. నో డౌట్..
తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దాదాపు అన్ని సర్వే సంస్థలూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నాయి. తాజాగా ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ సర్వే సైతం కాంగ్రెస్ పార్టీకే పట్టం గట్టింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు 47.49 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. అలాగే బీఆర్ఎస్ కు 39.25 శాతం ఓట్లు వస్తాయని.. బీజేపీకు 9.31 శాతం ఓట్లు వస్తాయని ఆరా మస్తాన్ సర్వే అంచనా వేసింది.
ఇక ఇప్పటికే చాణక్య స్ట్రాటజీస్, స్మార్ట్ పోల్, నాగన్న సర్వే, పబ్లిక్ పల్స్(శ్రీనివాస్) సర్వే, జన్ మైన్, హెచ్ ఎంఆర్.. తదితర సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నాయి. ఇక ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలుస్తుందని చెబుతున్నాయి. ఇక కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం అంటూ ప్రచారం చేపట్టిన బీజేపీకి డిపాజిట్లు వచ్చే అవకాశం లేదని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. అన్ని సర్వే సంస్థలు వెల్లడించిన అంచనాల ప్రకారం దాదాపు 10 శాతం లోపే ఓటింగ్ ఉంది.

ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కాసేపటిక్రితమే ముగిసింది. ఈనెల 14వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపినాథ్ మృతి కారణంగా ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ బై పోల్ లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీత పోటీ చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ బరిలో దిగారు. అలాగే బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డి పోటీ చేశారు. వీరితోపాటుగా ఈ ఎన్నికలో 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మరి వీరి భవితవ్యం ఈ నెల 14 న తేలనుంది.












Click it and Unblock the Notifications