కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే జరగబోయేది ఇదే

KTR: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్.. జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తోన్నారు.

తెలంగాణలో ఉన్న 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకీ అదే రోజున ఉప ఎన్నిక షెడ్యూల్ అయింది. జూన్ 4వ తేదీన ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Ab ki baar 400 paar means petrol and diesel cost will cross Rs 400 per liter says KTR

ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి పార్టీలన్నీ కూడా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన పట్టును నిలుపుకోవడానికి కాంగ్రెస్, ఈ ఎన్నికల్లోనైనా ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనే ఉద్దేశంలో బీఆర్ఎస్, బీజేపీ ఉన్నాయి. హోరాహోరీగా ప్రచారం సాగిస్తోన్నాయి.

ఈ క్రమంలో- రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేటీఆర్ రోడ్ షోను నిర్వహించారు. బీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ తరఫున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మహేశ్వరంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. పార్టీకే చెందిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ ప్రకాష్ గౌడ్, ఇతర నాయకులు ఇందులో పాల్గొన్నారు.

కాంగ్రెస్, బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు కేటీఆర్. ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణకు ద్రోహం చేశాయని ధ్వజమెత్తారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను భ్రష్టు పట్టించాయని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే నిత్యావసర సరుకుల ధరల ఆకాశాన్ని అంటుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

అబ్ కీ బార్ 400 పార్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఊదరగొడుతున్నారంటూ దీనికి కొత్త అర్థం చెప్పారాయన. ఈ సారి తాము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ ఒక్కింటికి 400 రూపాయలకు పైగా పెంచుతామని దీనికి అర్థమని వ్యాఖ్యానించారు. అలాగే వంటగ్యాస్ సిలిండర్ రేటు 5,000 రూపాయలకు తీసుకెళ్తారని పేర్కొన్నారు.

మోదీ ప్రియమైన ప్రధాని కాదని.. పిరమైన ప్రధాని అని అన్నారు. అలాంటి పాలకులు తమకు వద్దని చెప్పారు. తెలంగాణ కోసం కేసీఆర్ సాగించిన పోరాటాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ 10 సంవత్సరాల కాలంలో తాము అంధించిన సుపరిపాలన మళ్లీ రావాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+