గొర్రెల పంపిణీ స్కాం: నలుగురు అధికారుల అరెస్ట్
కామారెడ్డి: గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీలో అక్రమాల కేసులో అరెస్టులు ప్రారంభమయ్యాయి. ఈ స్కాంపై విచారణ జరుపుతున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం నలుగురు సీనియర్ ప్రభుత్వ అధికారులను అరెస్టు చేశారు.
అరెస్టైన వారిలో కామారెడ్డి వెటర్నరీ ఏరియా ఆస్పత్రి అసిస్టెంట్ డైరెక్టర్ ధర్మపురి రవి, మేడ్చల్ పశుసంర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ముంత ఆదిత్య కేశవ సాయి, రంగారెడ్డి జిల్లా భూగర్బ జల అధికారి రఘుపతి రెడ్డి, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేష్ ఉన్నారు.

గొర్రెల పంపిణీలో భారీగా అవకతవకలు జరిగాయనే ఆరోపణ నేపథ్యంలో ఏసీబీ అధికారులు గత కొద్ది రోజులుగా దర్యాప్తు చేస్తున్నారు. రికార్డుల పరిశీలన, బాధితుల నుంచి వివరాలు సేకరించి విచారణ చేపట్టారు.
బినామీల పేర్లతో నిధులను దారి మళ్లించారనే ఆధారాలను సేకరించారు. ఈ కేసులో పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్ల పాత్రలపైనా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇటీవల కాగ్ కూడా ఈ పథకంలో భారీగా అవకతవకలు జరిగాయని తన నివేదికలో వెల్లడించింది.
గొర్రెల పంపిణీలో అవకతవకలకు పాల్పడి రూ. 2.10 కోట్లు కాజేశారు అధికారులు. గొర్రెలను కొనుగోలుదారులకు డబ్బులు చెల్లించకుండా బ్రోకర్ల అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన గొర్రెల పెంపకందారులు ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.












Click it and Unblock the Notifications