ఏసీబీకి చిక్కిన మర్రిగూడ తహసీల్దార్: 2 కోట్ల నగదు సీజ్, 4.56 కోట్ల ఆస్తులు గుర్తింపు
హైదరాబాద్: భారీగా అక్రమాస్తులు కూడగట్టిన నల్గొండ జిల్లా మర్రిగూడ మండల తహసీల్దార్ మంచిరెడ్డి మహేందర్ రెడ్డిని అవినీతి నిరోధక శాఖ(ACB) అదుపులోకి తీసుకుంది. ఆయన నివాసంలో భారీగా నగదు, బంగారం దొరకడం గమనార్హం. మొత్తం రూ. 4.56 కోట్ల ఆస్తులు వెలుగుచూశాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు మర్రిగూడ తహసీల్దార్ కార్యాలయం, హైదరాబాద్ హస్తినాపురం పరిధి షిర్డీసాయినగర్‌లోని మహహేందర్ రెడ్డి నివాసంలో శనివారం సోదాలు నిర్వహించారు.
మంచిరెడ్డి మహేందర్ రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వెలిమినేడు. ఈయన తండ్రి అంజన్ రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తూ.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కారుణ్య నియామకం కింద మహేందర్ రెడ్డికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. తొలి పోస్టింగ్‌లో భాగంగా కందుకూరు ఆర్డీవో కార్యాలయంలో 2004లో జూనియర్ అసిస్టెంట్‌గా చేరారు.

ఆ తర్వాత ఆర్ఐ, డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్‌గా పదోన్నతి పొందారు. మొదట రంగారెడ్డి జిల్లా కడ్తాల్, అనంతరం కందుకూరు తహసీల్దార్‌గా పనిచేశారు. ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆగస్టు 3న నల్గొండ జిల్లా మర్రిగూడకు బదిలీ అయ్యారు. అయితే, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు కొన్నాళ్ల కిందట ఏసీబీకి ఆయనపై సమాచారం అందింది.
ఈ క్రమంలో ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీఖాన్ బృందం శనివారం ఉదయం 6 గంటలకు హస్తినాపురంలోని మహేందర్ రెడ్డి ఇంట్లో సోదాలు మొదలు పెట్టారు. ఈ సమయంలోనే మహేందర్ రెడ్డి అక్కడే ఉన్నారు. ఆయన ఇంట్లో ఏసీబీకి ఒక ఇనుప పెట్టె దొరికింది. దాన్ని కట్టర్‌తో తెరిచారు. ఆ పెట్టెలో రూ. 500 కోట్ల కట్టలతో కూడిన రూ. 2.07 కోట్లు నగదు లభించింది. ఇతర బంగారు నగలు, పలు డాక్యుమెంట్ుల స్వాధీనం చేసుకున్నారు.
నగదు, స్థిరాస్తులన్నీ కలిపి రూ. 4.56 కోట్లుగా ఏసీబీ అధికారులు లెక్కగట్టారు. ఇందులో కిలో బంగారం ఉన్నట్లు తెలిసింది. శనివారం ఉదయం 6 గంటలకు ప్రారంభించిన తనిఖీలు.. రాత్రి 8 గంటల వరకు కొనసాగుతూనే ఉన్నాయి. సోదాల మధ్యలో మహేందర్ రెడ్డిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. కాగా, మహేందర్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగం చేస్తూనే స్థిరాస్థి వ్యవహారాలు నడిపిస్తుంటారని తెలిసింది.












Click it and Unblock the Notifications