కేసీఆర్‌తో ఏసీబీ డీజీ, 'టీఆర్ఎస్‌కి 25ఓట్లు ఎక్కువెలా'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో ఐసీబీ డీజీ ఏకే ఖాన్ గురువారం క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. తాజా పరిణామాల పైన వారు చర్చించినట్లుగా తెలుస్తోంది. ఓటుకు నోటు కేసులో అరెస్టైన రేవంత్ రెడ్డి అంశం వారి మధ్య చర్చకు వచ్చిందని తెలుస్తోంది.
రేవంత్ రెడ్డిని విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని సీసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. ఈ క్రమంలో ఆ అంశానికి సంబంధించి చర్చించేందుకు కేసీఆర్‌కు ఏసీబీ డీజీ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

రేవంత్ రెడ్డికి జైలులో ప్రత్యేక సదుపాయాలివే
రేవంత్ రెడ్డికి చర్లపల్లి జైలులో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన ఇతర ఖైదీల మాదిరిగా బ్యారక్‌లో కాకుండా ప్రత్యేకంగా ఓ గదిలో ఉంటారు.
వంట కూడా వేరుగా, తనకు నచ్చిన రీతిలో స్వయంగా చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఇందుకోసం స్టవ్, పాత్రలు అందిస్తారు. అవసరమైతే ఇంటి నుండి భోజనం తెప్పించుకోవచ్చు. ఫ్యాన్, టీవీ వంటి సదుపాయాలు ఉంటాయి.
తెరాసకు 25 ఓట్లు ఎలా ఎక్కువ వచ్చాయి: రావుల
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిన వ్యవహారంలో తెరాసనే ప్రధాన ముద్దాయి అని తెలంగాణ టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం టీడీపీ పైన ఇంత కుట్ర ఎందుకు చేస్తుందో చెప్పాలన్నారు. తెరాసకు ఉన్న ఎమ్మెల్యేల కంటే 25 ఓట్లు ఎక్కువ ఎలా వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications