టార్గెట్ కేటీఆర్..ఈసారి గురి తప్పేలా లేదే..!
హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న (బుధవారం) విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను ఆదేశించినట్లు సమాచారం.
ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో అక్రమాలు జరిగాయని, దీని ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని గత కొంతకాలంగా ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో భాగంగానే కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఈ కేసులో గతంలో కొంతమంది అధికారులు, నిర్వాహకులపై కూడా ఏసీబీ దృష్టి సారించినట్లు సమాచారం. ఏసీబీ నోటీసులపై కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కేసు పూర్తిగా రాజకీయ వేధింపు అయినప్పటికీ, నేను ఖచ్చితంగా ఏసీబీకి సహకరిస్తానని కేటీఆర్ తెలిపారు.అయితే ముందుగానే విదేశాలకు వెళ్లడానికి ప్లాన్ చేసుకోవడంతో, ఆ పర్యటన ముగించుకున్న తర్వాత విచారణకు హాజరవుతానని కేటీఆర్ చెప్పుకొచ్చారు.ఇది రేవంత్ రెడ్డి రాజకీయ ప్రతీకార దాహానికి నిదర్శనమని కేటీఆర్ అభివర్ణించారు.
The ACB has given me a notice to appear for an enquiry on the 28th of May in the Formula E case
— KTR (@KTRBRS) May 26, 2025
As a law abiding citizen, will definitely cooperate with the agencies even though the case is nothing but pure political harassment
As I have planned to leave for the UK & USA for…
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications