కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు.. కవిత సంచలన ట్వీట్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కొద్దిసేపటి క్రితమే ఏసీబీ నోటీసులు జారీ చేసింది. గతంలో నిర్వహించిన ఫార్ములా ఈ కేసులో విచారణకు రావాలని ఆదేశించింది. ఈ నెల 28న విచారణకు రావాలని ఈ మేరకు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కేటీఆర్ కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేయడం ఇది రెండోసారి. గతంలోనూ ఆయనకు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. కానీ ఆయన హాజరు కాలేదు. దీంతో మరోసారి కేటీఆర్ కు ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు.
అయితే కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈమేరకు సంచలన ట్వీట్ చేశారు. కేటీఆర్ కు ఏసీబీ నోటీసులపై తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి రేవంత్ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని కవిత ఆరోపించారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టిన కేసీఆర్ సైనికులు తట్టుకుని నిలబడ్డారని కవిత అన్నారు.

"తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం @KTRBRS గారికి నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు.. Kavitha Kalvakuntla (@RaoKavitha)" అని ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్ చేశారు.
తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం @KTRBRS గారికి నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 26, 2025
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు…
కేటీఆర్ తో విబేధాలు వచ్చాయంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో కవిత ట్వీట్ సంచలనంగా మారింది. తమ పార్టీ నాయకులకు వరుస నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు అర్థమైతోందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు, రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు స్పష్టమవుతోందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.












Click it and Unblock the Notifications