రూ.30 లక్షలు, నగల కొనుగోలుపై నోరు మెదపని తహశీల్దార్ సుజాత, నేడు మరోసారి విచారణ,అరెస్ట్...?

షేక్‌పేట భూముల వ్యవహారంలో తహశీల్దార్ సుజాత అక్రమాలు ఒక్కొక్కటి వెలుగుచూస్తున్నాయి. తన ఇంట్లో దొరికన రూ.30 లక్షల గురించి సుజాత.. పొంతనలేని సమాధానాలు చెబుతుందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. నిన్న నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించిన.. ఆ నగదుకు సంబంధించిన వివరాలేమీ తెలియరాలేదు.

నగదుకు సంబంధించిన ఆధారాలు చూపించకపోవడంతో అక్రమాలు జరిగింది నిజమేనని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. నగదుతోపాటు నగల కొనుగోలుపై డాక్యుమెంట్స్ లేవు. కానీ జీతం డబ్బులు మాత్రం బ్యాంకు నుంచి విత్ డ్రా చేశానని చెప్పారు. కానీ బ్యాంకు నుంచి తీసిన డబ్బులకు సంబంధించి ఆధారాలు కూడా చూపించలేదు.

acb officials today also enquire mro sujatha

రూ.30 లక్షలు, నగదు కాకుండా మరిన్ని భూములు పత్రాలను ఏసీబీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. భూ వ్యవహారంలో సంబంధం ఉన్న అందరినీ ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. సుజాత కాల్ రికార్డును పరిశీలిస్తున్నారు.

అందులో ఉన్న వారి పేర్ల ఆధారంగా విచారణ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్డీవో వసంతకుమారిని విచారించారు. ఆర్ఐ నాగార్జున రెడ్డి, ఎస్సై రవీందర్ నాయక్‌ ఎంక్వైరీ గత రెండురోజుల నుంచి కొనసాగుతోంది. సుజాతతోపాటు వీరిద్దరీ స్టేట్ మెంట్లను రికార్డ్ చేశారు. సోమవారం సుజాతను మరోసారి విచారించి.. లంచం కేసులో పాత్ర ఉంది అని తేలితే రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+