రాజయ్య సన్నిహితుడి ఇంటిపై ఏసిబి దాడులు
హైదరాబాద్: మాజీ డిప్యూటీ సిఎం, టిఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య సన్నిహితుడు, మెడికల్ అండ్ హెల్త్ మాజీ డైరెక్టర్ సాంబశివరావు నివాసంపై ఏసిబి అధికారులు గురువారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. సాంబశివరావుపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఈ దాడులు నిర్వహించారు.
కాగా, అధికారులు జరిపిన తనిఖీల్లో భారీ మొత్తంలో అక్రమ ఆస్తులు బయటపడినట్లు సమాచారం. వరంగల్ తోపాటు మరో నాలుగు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. రాజయ్య డిప్యూటీ సిఎంగా ఉన్న సమయంలో సాంబశివరావు మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

ఈ సమయంలోనే 108 అంబులెన్స్‌ల కొనుగోళ్ల వ్యవహారంలో ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. ఇది ఇలా ఉండగా, తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని సాంబశివరావు చెబుతున్నారు.
రౌడీషీటర్ యూసఫ్ హత్య కేసులో నిందితుల అరెస్ట్
నల్లగొండ: రౌడీ షీటర్ యూసఫ్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్యతో సంబంధం ఉన్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని డీఎస్పీ రాములు నాయక్ వివరాలు వెల్లడించారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications