వామ్మో.. తెలంగాణలో చిక్కిన భారీ తిమింగలం
తెలంగాణలో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. TGSPDCL హైదరాబాద్ లో ఏడీఈగా పనిచేస్తున్న అంబేడ్కర్ అనే అధికారి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ మేరకు అంబేద్కర్ పై అక్రమాస్తుల కేసు నమోదైంది. అతని ఆస్తులు చూసి అధికారులు ఆశ్చర్యపోయారు.
శేరిలింగంపల్లిలో ఒక ఫ్లాట్, గచ్చిబౌలిలో ఆరంతస్తుల బిల్డింగ్, 10 ఎకరాల్లో ఆమ్తర్ కెమికల్స్ పేరిట కంపెనీ, హైదరాబాద్ లో 6 రెసిడెన్షియల్ ప్లాట్స్, 1 ఫామ్ ల్యాండ్ అలాగే 2 ఫోర్ వీలర్లు, బంగారం, బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బినామీ సతీష్ ఇంట్లో రూ. 2.18 కోట్లు స్వాధీనం చేసుకుంది. మొత్తం ఆస్తుల విలువ రూ.300 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
ఏసీబీ అధికారులు అంబేడ్కర్ ఇళ్లు, ఆయన బంధువులు, కుటుంబసభ్యుల ఇళ్లలో ముమ్మరంగా సోదాలు నిర్వహించింది. అయితే విద్యుత్ శాఖలో అవినీతి అధికారి వ్యవహారం బట్టబయలు కావడంతో చర్చనీయాంశమైంది. అంబేడ్కర్ ఆస్తులపై సోదాలు ముగిసిన అనంతరం ఆయనను అరెస్టు చేసింది. కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించింది.

ఏడీఈగా పనిచేస్తున్న అంబేడ్కర్ పై ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అంబేడ్కర్ ప్రస్తుతం కొండాపూర్ లోని మేఘన లేక్ వ్యూ అపార్ట్‌మెంట్‌లోని మూడో అంతస్తులో ఉంటున్నాడు. ఈయనపై ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. తమకు అందిన ఫిర్యాదులతో రంగంలోకి దిగిన ఏసీబీ కేసు నమోదు చేసి సోదాలు చేపట్టింది.
-
మూసీ తీరాన మహత్తరం -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా












Click it and Unblock the Notifications