రూ. 3 కోట్లకుపైగా ఆస్తుల గుర్తింపు: లంచం తీసుకున్న సీఐ, ఏఎస్ఐ చంచల్‌గూడ జైలుకు
హైదరాబాద్: షాబాద్ ఇన్స్పెక్టర్ శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్‌కు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఉస్మానియా ఆస్పత్రిలో సీఐ శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వారిద్దరినీ ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
షాబాద్ సీఐ శంకరయ్యకు సంబంధించి ఏసీబీ అధికారులు భారీగా ఆదాయానికి మంచిన ఆస్తులను గుర్తించారు. రెండు ఇళ్లు, 11 ఇళ్ల స్థలాలు, బంగారు ఆభరణాలు, 41 ఎకరాల వ్యవసాయ భూమి, రూ. 17,88 లక్షల నగదు సహా రూ. 3.58 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. శుక్రవారం ఎల్బీనగర్లోని సీఐ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

కాగా, భూ వివాదానికి సంబంధించి కేసులు నమోదు చేయకుండా ఉండేందుకు షాబాద్ సీఐ శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్ పోలీస్ స్టేషన్లోనే రూ. 1.2 లక్షల లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు సదరు పోలీసు అధికారి నివాసాల్లో సోదాలు నిర్వహించి భారీ ఆస్తులను గుర్తించారు.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications