ఇవాంకా ట్రంప్ హైద్రాబాద్‌ టూర్: మోడీ ఆహ్వనం మేరకే....

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ భారతదేశంలో పర్యటించనున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూవర్‌షిప్ సమ్మిట్‌లో ఆమె పాల్గొంటారు.

ఈ ఏడాది నవంబర్‌లో హైద్రాబాద్‌లో ఈ సదస్సు జరుగుతోంది. ఇటీవల అమెరికాలో భారత ప్రధానమంత్రి మోడీ పర్యటించిన సమయంలో ఇవాంకాను ఇండియాకు రావాలని మోడీ ఆహ్వానించారు.

Accepting PM Modi invitation, Ivanka Trump will head to Hyderabad in November-end

భారత్‌లో పర్యటించే అమెరికా ప్రతినిధిబృందానికి ఇవాంకాను నేతృత్వం వహించాలని మోడీ కోరారు. అయితే అమెరికా బృందానికి తాను నాయకత్వం వహించాలని మోడీ కోరడం పట్ల ఆమె ధన్యవాదాలు తెలిపారు.

ఇవాంకా ట్రంప్ వ్యాపారవేత్తగా, ఫ్యాషన్ మోడల్‌గా ప్రఖ్యాతిగాంచింది. ప్రస్తుతం ఇవాంకా ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సహయకురాలిగా ఉన్నారు. ఆమె భర్త జారెడ్ కుష్నర్ కూడ డొనాల్డ్‌ట్రంప్‌కు సహయకుడిగా ఉన్నారు.వీరిద్దరూ కూడ తమ సేవలకు వేతనం తీసుకోవడం లేదు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
US President Donald Trump’s daughter and advisor, Ivanka Trump, is scheduled to visit Hyderabad in the last week of November, for the Global Entrepreneurship Summit November 28, 2017.
Please Wait while comments are loading...