Monsoons: రైతులకు శుభవార్త.. జూన్ లో విస్తారంగా వర్షాలు..
రైతులకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. జూన్ లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలు మే 31 వరకు కేరళ తీరాన్ని తాకుతాయని పేర్కొంది. ప్రస్తుతం రుతుపవనాలు బంగాళాఖాతంలో విస్తరిస్తున్నాయని వివరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేసింది. ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది.
దక్షిణాది రాష్ట్రాల్లో జూన్ లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. మే 24 వరకు పుదుచ్చేరి, తమిళనాడులో అతి భారీ వర్షాలు కురిస్తాయని పేర్కొంది. కేరళలోని తురవనంతపురుంలో మంగళవారం రాత్రి నుంచి వాన పడుతోంది. కేరళలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో కూడా వచ్చే మూడు రోజులు తెలంగాణలో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

బుధవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురం భీం అసిఫాబాద్, ఆదిలాబాద్ లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం మహబుబ్ నగర్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ముగులు, జయశంకర్ భూపాలపల్లి వానలు పడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications