Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అభయ్ హత్య షాక్: నటులుగా ఎదిగేందుకు, 'ఒక రొమాంటిక్ క్రైం' సినిమా చూసి..

హైదరాబాద్: భాగ్యనగరంలో సంచలనం సృష్టించిన పదో తరగతి విద్యార్థి అభయ్ హత్య కేసులో సీపీ మహేందర్ రెడ్డి షాకింగ్ విషయం వెల్లడించారు. నిందితులు చిన్నసాయి, రవి, మోహన్‌లు ఈ నెల 14వ తేదీన 'ఒక రొమాంటిక్ క్రైమ్' సినిమాను చూసి, దానిని ఫాలో అయి చంపేసినట్లుగా తేలిందని చెప్పారు.

మరో షాకింగ్ విషయమేమంటే, సినిమాను చూసి అభయ్‌ని చంపేసిన నిందితులు, సినిమా నటులుగా స్థిరపడేందుకు ఈ ఘాతుకానికి ఒడిగట్టారని తేలినట్లు సీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. సినిమాలో నటించాలని, తీయాలనే వారు కలలు కన్నారు. సీపీ మహేందర్ రెడ్డి ఆదివారం నాడు వివరాలు వెల్లడించారు.

Also Read: ఆంధ్ర గ్యాంగ్‌తో కలిసి అభయ్ కిడ్నాప్, హత్య (పిక్చర్స్)

నిందితులు ఏపీకి చెందినవారు

ఈ నెల 16వ తేదీన అభయ్ కిడ్నాప్, హత్య జరిగిందన్నారు. అమాయకుడిని చంపడం దారుణమన్నారు. ముగ్గురు కలిసి అభయ్‌ని కిడ్నాప్ చేశారని చెప్పారు. నిందితులు చిన్నసాయి అలియాస్ శేషు, రవి, మోహన్‌లు అని వెల్లడించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని, రిమాండుకు తరలిస్తామని చెప్పారు.

Accused follow 'oka romantic crime' movies to kill Abhay

డబ్బుకోసమే అభయ్‌ని చంపినట్లు నిర్ధారణ అయినట్లు చెప్పారు. అభయ్ హత్య దురదృష్టకరమన్నారు. సాయి తూర్పు గోదావరి జిల్లా అనపర్తికి చెందిన వారని చెప్పారు. మిగతా ఇద్దరు రవి, మోహన్‌లు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారని చెప్పారు. నిందితులంతా 22 ఏళ్లవారేనని చెప్పారు.

సినిమాలో స్థిరపడేందుకు.. సినిమాను చూసి

అభయ్ హత్యకు రెండు రోజుల ముందు నిందితులు యూట్యూబ్‌లో ఒక రొమాంటిక్ క్రైమ్ సినిమాను చూశారని, ఆ సినిమా చూశాక, వారికి కిడ్నాప్ ఆలోచన వచ్చిందని చెప్పారు. ఆ సినిమాలో చైన్ స్నాచింగులు, కిడ్నాప్ చేయడం వంటి అంశాలతో వారు ఇన్‌స్పైర్ అయ్యారని చెప్పారు.

వారికి సినిమా ఫీల్డులో రాణించాలనే కోరిక ఉంది. దీంతో ఆ సినిమాను చూసి, దానిని ఫాలో అయి, కిడ్నాప్ ద్వారా డబ్బులు సంపాదించి, సినిమా ఫీల్డులో నటులుగా ఎదగాలని భావించారని చెప్పారు. ఇందుకోసం ముగ్గురు నిందితులు కూడబలుక్కున్నారని చెప్పారు.

14వ తేదీన సినిమాను చూసినసమయంలోనే నిందితుడు చిన్న సాయి అలియాస్ శేషు తనకు అభయ్ మదాని అనే తెలిసిన విద్యార్థి ఉన్నాడని, అతను ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లు వాడుతుంటాడని, వారి వద్ద చాలా డబ్బులు ఉంటాయని తనకు తెలిసిందని చెప్పాడు. అభయ్ అంటే తల్లిదండ్రులకు చాలా ఇష్టమని చెప్పాడని తెలిపారు.

దీంతో అదే రోజు రాత్రి అభయ్ కిడ్నాప్‌కు వారు తాము ఉండే హిందీనగర్‌లోని రెండో అంతస్తు గదిలో ప్లాన్ వేశారని చెప్పారు. ఆ తర్వాత సినిమాలో ప్లాస్టర్ వేసిన విషయం గుర్తుకు వచ్చి ప్లాస్టర్ కొన్నారని చెప్పారు. ఆ తర్వాత అభయ్‌ని 16వ తేదీన మహాలక్ష్మి టిఫిన్ సెంటర్ వద్ద చిన్నసాయి కలుసుకున్నాడని తెలిపారు.

Accused follow 'oka romantic crime' movies to kill Abhay

తనకు లిఫ్ట్ కావాలని అడిగాడని, పక్కనే హిందీ నగర్లో తన గది ఉందని, అక్కడ డ్రాప్ చేయాలని, అలాగే తన గది చూడాలని అభయ్‌కి చిన్నసాయి సూచించాడు. అతను తెలిసినవాడు కావడంతో అభయ్ లిఫ్ట్ ఇచ్చాడు. అభయ్‌కి పదేపదే ఫోన్లు రావడంతో చిన్నసాయి వాహనం నడిపాడు.

కూల్ డ్రింక్ ఇచ్చి, కిడ్నాప్ విషయం..

ఆ తర్వాత తాము ఉండే ఇంటిలోని రెండో ఫ్లోర్ గదికి తీసుకు వెళ్లాడు. అక్కడ అభయ్‌కి కూల్ డ్రింక్ ఇచ్చారు. స్నేహపూర్వక వాతావరణం సృష్టించారు. ఆ తర్వాత నెమ్మదిగా కిడ్నాప్ చేస్తున్నట్లు చెప్పారు. దీంతో షాకైన అభయ్.. తన తండ్రి డబ్బులు అడిగితే ఇస్తాడని, నన్ను మాత్రం ఏం చేయవద్దని మొరపెట్టుకున్నాడు.

పొరపాటున ముక్కుకు ప్లాస్టర్

క్రైమ్ సినిమాను చూసిన నిందితులకు ప్లాస్టర్ విషయం గుర్తుకు వచ్చి, అభయ్ నోటికి ప్లాస్టర్ వేశారు. అతని చేతులు వెనక్కి కట్టివేశారు. నోటికి మాత్రమే ప్లాస్టర్ వేయబోయి, పొరపాటున ముక్కుకు కూడా వేశారు. అనంతరం అతనిని ఫ్లోర్ పైన పడుకోబెట్టారు.

అభయ్ అక్కడ ఊపిరి ఆడక కాసేపు అటు ఇటు కదిలాడు. అయితే అతను విడిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని నిందితులు భావించారు. కానీ ఊపిరి ఆడక అలా చేస్తున్నాడని గుర్తించలేకపోయారు. దీంతో అతను మృతి చెందాడు.

ఆ తర్వాత అతనిని అట్టపెట్టెలో అబిడ్స్ మీదుగా సికింద్రాబాద్ తీసుకు వచ్చారు. అల్ఫా హోటల్ పక్కన అభయ్ మృతదేహాన్ని ఉంచారు. అక్కడ ఓ కొత్త ఫోన్, సిమ్ కార్డు కొన్నారు. వారికి ఐడీ ప్రూఫ్‌లు లేకపోవడంతో దుకాణదారు.. ఎక్కువ డబ్బులు తీసుకొని, మరొకరి పేరు మీద వాటిని ఇచ్చాడు. కాగా, ఈ కేసును పోలీసులు 48 గంటల్లో చేదించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+