కెసిఆర్ సెన్షేషనల్ లీడర్ ఎన్టీఆర్ లాగే..: పొగిడేసిన యాక్టర్ సుమన్

నల్లగొండ: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును తెలుగు సినీ నటుడు సుమన్ ప్రశంసలతో ముంచెత్తారు. దేశంలో ఇప్పటివరకు ముగ్గురే సెన్సేషనల్ లీడర్స్ అని, వారు ఎంజీఆర్, ఎన్టీఆర్, కేసీఆర్ అని సినీనటుడు ఆయన అన్నారు. సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు సోమవారం నల్లగొం డ జిల్లాకు వచ్చిన ఆయన హుజూర్‌నగర్‌లో మీడియాతో మాట్లాడారు.

తమిళనాడులో ఎంజీఆర్‌, ఆంధ్రాలో ఎన్టీఆర్‌, తెలంగాణలో కేసీఆర్‌ అసలైన హీరోలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఆవిర్భావం కోసం కేసీఆర్‌ చేసిన పోరాటం గొప్పదన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు.

 Actpr Suman terms KCR as sensational leader

హైదరాబాద్‌లో ప్రభుత్వం ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తుండడంతో భవిష్యత్‌లో ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రధానకేంద్రంగా హైదరాబాద్ మారుతుందని అన్నారు. తెలంగాణ చరిత్ర ఇతివృత్తంతో తీసిన సినిమాలకు, తెలంగాణలో తీసిన సినిమాలకు పన్నులు తగ్గించడం సంతోషకరమని అభిప్రాయపడ్డారు.

చిన్న సినిమాల ను బతికించుకోవడానికి 200 సీట్ల సామర్థ్యం గల టాకీస్‌లు నిర్మించాల్సిన అవసరం ఉన్నదన్నారు. శుక్ర,శని,ఆదివారాల్లో ఐదు షోలు వేయడం వల్ల కూడా చిన్న సినిమాలకు టాకీసులు దొరికే అవకాశం ఉన్నదని అభిప్రాయపడ్డారు. చిన్న సినిమాలను ఆదరించాలని సినీనటుడు సుమన్‌ ప్రేక్షకులను కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+