రాహుల్ తో పూనం కౌర్ సమావేశం : త్వరలో సోనియాతో భేటీ - ఫిక్స్ అయ్యారా..!!
రాహుల్ భారత్ జోడో యాత్రలో ఆసక్తి కర పరిణామం చోటు చేసుకుంది. సినీ నటి పూనం కౌర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. దాదాపు 15 నిమిషాలు ఇద్దరి మధ్య మాటలు జరిగాయి. రాహుల్ గాంధీ సమస్యల పైన స్పందిస్తున్న తీరును పైనం ప్రశంసించారు. ఖాది వస్త్రాలకు కాంగ్రెస్ పార్టీకి అవినాభావ సంబంధం ఉందని పూనం చెప్పారు. చేనేతల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయాలని పూనమ్ కోరారు. అదే సమయంలో.. రాహుల్ గాంధీ చేనేత సమస్యల పైన తాము అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
ఒక సారి సోనియా - ప్రియాంకతో భేటీ కావాలని రాహుల్ సినీ నటి పూనమ్ కు సూచించారు. పూనమ్ ను సోనియాగాంధీతో కలిపించే బాధ్యతను పార్టీ నాయకులకు రాహుల్ అప్పగించారు. తాను రాహుల్ తో చేనేత కార్మికులు మహిళల సమస్యలపై చర్చించినట్లు పూనమ్ వెల్లడించారు. రాహుల్ గాంధీ సమస్యలను బాగా అధ్యయనం చేస్తున్నారని పూనమ్ వ్యాఖ్యానించారు. వినతి పత్రాలు ఇవ్వగానే చదివిన తర్వాతే మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత వస్త్రాలపై రాష్ట్ర జీఎస్టీని తగ్గించాలని పూనమ్ డిమాండ్ చేసారు. తనకు రాజకీయాల్లోకి వెళ్లాలని ఆలోచన లేదని స్పష్టం చేసారు. సమస్యల మీద పోరాటం చేస్తున్నానని చెప్పారు. చేనేత వర్గ ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

మునుగోడు లో చేనేతల కోసం పనిచేయని వారికి ఓటేయకండని సూచించారు. అధికార పార్టీని చేనేత వస్త్రాలపై జీఎస్టీ తగ్గించాలని డిమాండ్ చేయాలని కోరారు. చేనేత సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడాలని రాహుల్ గాంధీని పూనమ్ కోరారు. అయితే, ఇప్పుడు మునుగోడు ఎన్నికల వేళ..చేనేత వర్గానికి పూనమ్ చేసిన సూచన..త్వరలో సోనియాతో పూనమ్ భేటీ కావాలంటూ రాహుల్ సూచించటం కాంగ్రెస్ లో ఇప్పుడు ఆసక్తి కర చర్చ మొదలైంది.
కానీ, పూనమ్ మాత్రం తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదంటూ తేల్చి చెప్పారు. కానీ, పూనమ్ ను ఒప్పించి కాంగ్రెస్ లోకి తీసుకొచ్చే ఆలోచనల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నట్లుగా పార్టీలో ప్రచారం సాగుతోంది. ఈ వ్యవహారం పైన పూనమ్ ఢిల్లీలో సోనియాతో భేటీ సమయంలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications