మార్నింగ్ వాకింగ్‌కి వెళ్లి.. ఇక తిరిగి రాని లోకాలకు అడిషనల్ డీసీపీ

మరణం అనేది ఎప్పుడు ఏ రూపానా వస్తుందో చెప్పలేం. అనారోగ్యం కావొచ్చు, ఊహించని ప్రమాదం కావొచ్చు ఎలా సంభవిస్తుందో ఎవరూ చెప్పలేరు. వీటిలో ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు కూడా ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఓవర్ స్పీడ్, అజాగ్రత్త కారణంగా వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాహణదారులే కాకుండా.. పలుమార్లు సామాన్యులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు.

ఈ తరహా ఘటనే హైదరాబాద్ లోని హయత్ నగర్ లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తెలంగాణ డీజీపీ ఆఫీసులో అడిషనల్ డీసీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బాబ్జీ ప్రాణాలు కోల్పోయారు. లక్ష్మారెడ్డి పాలెం వద్ద ఆయన ఈరోజు తెల్లవారుజామున మార్నింగ్ వాకింగ్ చేస్తుండగా.. ఆర్టీసీ బస్సు బలంగా ఢీ కొట్టడంతో ఈ విషాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందగా.. ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

additional-dcp-babji-died-in-road-accident-at-hyderabad

మరోవైపు ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.బాబ్జీ మరణంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల పోలీసు ఉన్నతాధికారులు సంతాపం తెలియజేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+