పంటపొలాల్లో పడిన విమానం, గాలిల్లో చక్కర్లు కొట్టి క్రాష్ ల్యాండ్, ఇద్దరు పైలట్ల మృతి..
వికారాబాద్‌లో జిల్లాలో ఓ విమానం క్రాష్ ల్యాండయ్యింది. బట్వార మండలం సుల్తాన్‌పూర్ సమీపంలో గల పంటపొలాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్, ట్రైనీ పైలట్ ఇద్దరు మృతిచెందారు. పైలట్ ప్రకాశ్ విశాల్ అని గుర్తించారు. ట్రైని పైలట్ వివరాలు తెలియాల్సి ఉంది. బేగంపేట విమానాశ్రయం నుంచి బయల్దేరిన తర్వాత 45 నిమిషాలకు ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయని అధికారులు చెప్తున్నారు. గాలిలో చక్కర్లు కొట్టి కుప్పకూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.
విమానం టేకాఫ్ అయ్యే సమయంలో వాతావరణ పరిస్థితి బాగానే ఉంది. ఆ తర్వాత భారీ వర్షం, ఉరుమెలు, మెరుపులు రావడంతో వాతావరణ ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో విమానంలో గాలిలోనే చక్కర్లు కొట్టిందని స్థానికులు చెప్తున్నారు. అలా పది నిమిషాలు చక్కర్లు కొట్టి కుప్పకూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

విమానం ప్రమాదం తెలియగానే బేగంపేట ఎయిర్‌పోర్ట్ అధికారులు ఘటనాస్థలికి చేరుకొన్నారు. అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రమాదానికి గల కారణంపై అన్వేషిస్తున్నారు. మరోవైపు మృతిచెందిన పైలట్ ప్రకాశ్ విశాల్ అధికారులు తెలిపారు. ట్రైనీ పైలట్ మహిళ అని తెలుస్తోంది. కానీ ఆమె వివరాలు తెలియాల్సి ఉంది. విమాన ప్రమాదం తర్వాత బురదలో కురుకున్నట్టు తెలుస్తోంది. వాతావరణ పరిస్థితుల సరిగా లేనందున ప్రమాదం జరిగిందని ఎయిర్‌ఫోర్స్ అధికారులు అంచనా వేశారు. దీనిపై శాఖపరంగా విచారిస్తున్నామని తెలిపారు.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!!












Click it and Unblock the Notifications