హైదరాబాద్ లో ఈ ప్రాంతంలో రూ. 25 లక్షలకే 2BHK .. బెస్ట్ ఛాయిస్..
ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. సొంతింటి కల కోసం అందరూ పరితపిస్తుంటారు. పేద, మధ్య తరగతి ప్రజలకు జీవితంలో సొంతిళ్లు కట్టుకోవాలని కోరిక ఉంటుంది. అయితే సొంతిళ్లు కొనుక్కోవాలనుకునేవారికి ఇదో సువర్ణావకాశం. ఎక్కడో కాదు.. మన హైదరాబాద్ లోనే. అవును ప్రస్తుతం హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం గణనీయంగా పెరిగింది. ఇటీవల వేలంపాటలో ఎకరం రూ. 177 కోట్ల రూపాయలకు విక్రయించిన విషయం తెలిసిందే. అలాగే కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం వేలం పాటలో ఒక చదరపు గజం స్థలం రూ. 3 లక్షల రూపాయలు పలికింది.
అయితే హైదరాబాద్ లో సొంతిళ్లు కొనేవారికి భారీ శుభవార్త. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో అపార్ట్ మెంట్ ఫ్లాట్ ధరలు చూస్తే.. డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ప్రారంభం ధర రూ. 50 లక్షల నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక త్రిబుల్ బెడ్ రూమ్ అపార్ట్‌మెంట్ ఫ్లాట్ ధర రూ. కోటి రూపాయలు పలుకుతోంది. హైదరాబాద్ చుట్టుపక్కల హైవే ప్రాంతాల్లో ప్రస్తుతం తక్కువ ధరకే భూములు అందుబాటులో ఉన్నాయి. వరంగల్ హైవే సమీపంలోని పలు కాలనీల్లో తక్కువ ధరకే భూములు అందుబాటులో ఉన్నట్లు సమాచారం అందుతోంది.

ఇక ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రతాప సింగారం చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న పలు ప్రాంతాల్లో అపార్ట్ మెంట్ ఫ్లాట్స్ ధరలు డబుల్ బెడ్ రూమ్ రూ. 25 లక్షలు నుంచి ప్రారంభం ఉన్నట్లు సమాచారం. వీటి విస్తీర్ణం కూడా 800 చదరపు అడుగుల నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతం వరంగల్ హైవేకు కూడా దగ్గర్లోనే ఉండటం విశేషం. ప్రతాప సింగారం ప్రాంతం చుట్టుపక్కల పలు కాలేజీలు, స్కూళ్లు అభివృద్ది చెందుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతానికి ఫ్యూచర్ లో భారీగా వ్యాల్యూ పెరిగే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. తక్కువ ధరకే ఇళ్లు కొనుక్కోవాలని చూసే వారికి సువర్ణావకాశంగా భావించవచ్చు.












Click it and Unblock the Notifications