జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ హాల్‍లో గందరగోళం.. ఏజెంట్ల నిరసన !!
తెలంగాణ వ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వ్యవహారం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుండగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే ఈ ఎన్నికలో ఎవరు విజయం సాధిస్తారా అని సర్వత్రా చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రారంభంలో భాగంగా మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు లెక్కించారు. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 15 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 12 ఓట్లు దక్కాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డికి 9 ఓట్లు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ స్వల్ప ఓట్ల ఆధిక్యంలో నిలిచింది.
అయితే ఇప్పుడు అనూహ్యంగా కౌంటింగ్ హాల్‍లో గందరగోళం ఏర్పడింది. ఆయా పార్టీల అభ్యర్థుల తరఫున వచ్చిన ఏజెంట్ల కోసం సీటింగ్ ఏర్పాటు చేయకపోవడంతో వారు నిరసనకు దిగారు. సరైన ఏర్పాట్లు కూడా చేయలేరా అంటూ పలువురు అభ్యర్థులు కౌంటింగ్ హాల్ నుంచి బయటకు వస్తున్నారు. దీంతో అక్కడ కాసేపు గందరగోళం ఏర్పడింది. ఈ విషయాన్ని అధికారులు పరిశీలించి పరిస్థితిని సద్దుమనిగించేందుకు చర్యలు చేపట్టినట్టు సమాచారం.

ఇక ఇక పోస్టల్ బ్యాలెట్‌ల లెక్కింపు పూర్తైన తరుణంలో అధికారులు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ (EVM) లెక్కింపును ప్రారంభించారు. ఈవీఎంల సీల్స్‌ను తెరచి, రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే రెండు రౌండ్లు పూర్తి అవ్వగా ప్రధాన అభ్యర్థులుగా ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది. తొలి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. షేక్ పేట డివిజన్‌లో కాంగ్రెస్ కు ఆధిక్యం వచ్చింది. రెండో స్థానంలో బీఆర్ఎస్ ఉంది. తొలిరౌండ్‌లో కాంగ్రెస్‌కు 8,926 ఓట్లు.. బీఆర్ఎస్‌కు 8,864 ఓట్లు వచ్చాయి.












Click it and Unblock the Notifications