మెట్రో రైళ్లు రద్దు.. అన్ని స్టేషన్లలో హై అలర్ట్ : స్తంభించిన రైలు ప్రయాణం..!!
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వసంతో దాదాపు రైలు ప్రయాణం స్తంభించింది. అగ్నిపథ్ కు నిరసనగా ఆందోళనకారులు రైళ్లకు నిప్పు పెట్టారు. రాళ్లు విసిర రైళ్ల అద్దాలను ధ్వంసం చేసారు. మూడు రైళ్లు దగ్దం అయ్యాయి. నిరసనకారులను అదుపు చేయటానికి పోలీసులు కాల్పులు జరిపారు. అందులో ఒకరు మరణించగా..ఎనిమిది గాయ పడ్డారు. ఇక, స్టేషన్ లోని బీభత్స వాతావరణంతో దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ గా రాకపోకలు సాగించే 71 రైళ్లను రద్దు చేసింది. పలు రైళ్లను వరంగల్ లో నిలిపివేసింది. అన్ని స్టేషన్లలోనూ హై అలెర్ట్ ప్రకటించారు.

మెట్రో రైళ్ల సర్వీసులను రద్దు
ఎంఎంటీఎస్ రైళ్లను నిలుపుదల చేసారు. నిరసనకారుల విధ్వంసంలో ఒక ఎంఎంటీఎస్ రైలు సైతం దహనమైంది. ఇక, పలు సాధారణ రైళ్లను దారి మళ్లించారు. ఇదే సమయంలో మెట్రో రైళ్ల సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసారు. మెట్రో అధికారులు ప్రయాణీకులు ఎవరూ మెట్రో స్టేషన్లకు రావద్దని సూచించారు. ఆందోళనల దృష్ట్యా హైదరాబాద్‌లో మెట్రో రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని మార్గాల్లోనూ ఈ రద్దు కొనసాగుతుందని స్పష్టం చేసారు. ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వెళ్లే 12ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు అయ్యాయి.

క్రమేణా అదుపులోకి పరిస్థితి
అదే విధంగా.. లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్లే 13 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేసారు. ఈ ఒక్క రోజు మాత్రమే ఈ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పరిస్థితి క్రమేణా అదుపులోకి వస్తోంది. మిగిలిన నిరసన కారులను సైతం స్టేషన్ వదిలి వెళ్లాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే, నిరసన కారులు ముందస్తుగానే నిరసనకు నిర్ణయించారని చెబుతున్నారు. తాము రైళ్లను నిలుపుదల చేయటం కోసమే వచ్చామని..ఆర్పీఎఫ్ తమ పైన లాఠీ ఛార్జ్ చేయటంతో ఈ పరిస్థితి వచ్చిందని చెప్పుకొస్తున్నారు.

స్తంభించిన రైలు ప్రయాణం తో..
అయితే, రైళ్లకు నిప్పు పెట్టి.. స్టాల్స్ ను ధ్వంసం చేయటంతో పాటుగా పోలీసుల పైరా రాళ్లతో దాడికి దిగారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఇక, ఈ పరిస్థితి రైల్వే ప్రయాణీకులకు సమస్యగా మారింది. అదే విధంగా నగరంలో మెట్రో ప్రయాణంతో ఉదయం ఆఫీసులకు వచ్చి వారు సైతం సాయంత్రం తిరుగు ప్రయాణంలో ఇబ్బందులు పడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆందోళనకారులను పూర్తిగా స్టేషన్ నుంచి బయటకు పంపిన తరువాత రైళ్ల రాకపోకల పైన నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications