కొత్త పీసీసీ చీఫ్: తెలంగాణ కాంగ్రెస్‌ కోసం కర్ణాటక నుంచి కీలక నేత

మంచిర్యాల్: తెలంగాణ.. అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది. దీనికి సంబంధించిన వేడి రాజుకుంటోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి ఇక ఎంతో సమయం లేదు. ఈ నేపథ్యంలో అధికార భారత్ రాష్ట్ర సమితి.. ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారిస్తోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గురి పెడుతోంది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోంది.

అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల సమరానికి సన్నద్ధమౌతోంది. పొరుగునే ఉన్న కర్ణాటకలో ఘన విజయం సాధించిన జోష్‌లో ఉంది కాంగ్రెస్. అక్కడి విన్నింగ్ ఫార్ములాను తెలంగాణలోనూ అమలు చేసేలా అడుగులు వేస్తోంది. 2014 తరువాత జరిగిన ఏ ఎన్నికలోనూ కనీసం గట్టి పోటీ కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్‌.. ఈ సారి దెబ్బ కొట్టాలనే పట్టుదలతో ఉంది.

AICC appointed PCC Chiefs of Gujarat and Puducherry, attached two leaders to Telangana incharge

ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలను పంపించింది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జీని ఇద్దరు నేతలను అటాచ్ చేసింది. పార్టీ సీనియర్ నాయకుడు మన్సూర్ అలీ ఖాన్‌ను రాష్ట్ర ఇన్‌ఛార్జీకి అటాచ్ చేసింది. అలాగే కర్ణాటక కాంగ్రెస్ బాధ్యతలను పర్యవేక్షించిన పీసీ విష్ణునాథ్‌ను కూడా అదే పదవిలో అపాయింట్ చేసింది.

గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రాజ్యసభ సభ్యుడు శక్తిసిన్హ్ గోహిల్‌ను నియమించింది. గత ఏడాది జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసిన విషయం తెలిసిందే. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా శక్తిసిన్హ్ గోహిల్‌కు పీసీసీ చీఫ్ బాధ్యతలను అప్పగించింది.

ప్రస్తుతం జగదీష్ ఠాకూర్ గుజరాత్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనను ఈ బాధ్యతల నుంచి తప్పించింది. అదే సమయంలో పుదుచ్చేరి పీసీసీ అధ్యక్షుడిగా ఎంపీ వైథిలింగం నియమితులయ్యారు. ముంబై ఆర్సీసీ అధ్యక్షురాలిగా శాసన సభ్యురాలు వర్షా గైక్వాడ్‌ను నియమించింది. గుజరాత్ పీసీసీ చీఫ్‌‌గా శక్తిసిన్హ్ గోహిల్‌ను నియమించినందున ఆయన స్థానంలో హర్యానా- ఢిల్లీ ఇన్‌ఛార్జీగా దీపక్ బబారియాను అపాయింట్ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+