టీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్దుల ఖరారులో కొత్త ట్విస్ట్ - తాజాగా లిస్టులో..!!
తెలంగాణలో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్దుల ఎంపిక ఉత్కంఠ పెంచుతోంది. ఇప్పటికే దాదాపు జాబితా సిద్దమైందని భావిస్తున్న సమయంలో కొత్త ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. ఇంకా ఆరేడు సీట్ల పైన స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. భువనగిరి సీటు కోసం పార్టీలో పోటీ ఎక్కువగా ఉంది. పార్టీలో కొత్తగా చేరిన వారికి సీట్లు ఇవ్వటం పైన పలువురు పార్టీ హైకమాండ్ ను సంప్రదిస్తున్నారు. దీంతొ, జాబితా పైన తుది కసరత్తు తరువాత పేర్లు ప్రకటించాలని భావిస్తున్నారు.
కొనసాగతున్న ఉత్కంఠ : కాంగ్రెస్ అభ్యర్థుల మలి జాబితాపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, భువనగిరి, హైదరాబాద్ సీట్లలో అభ్యర్థుల ఎంపిక పెండింగ్‌లో పడినట్లు చెబుతున్నారు. సీఈసీ సమావేశంలో సికింద్రాబాద్ (దానం నాగేందర్), మల్కాజిగిరి (పట్నం సునీతా మహేందర్‌రెడ్డి), చేవెళ్ల (రంజిత్‌రెడ్డి), వరంగల్ (పసునూరి దయాకర్), పెద్దపల్లి (గడ్డం వంశీ), నాగర్‌కర్నూలు (మల్లు రవి), ఆదిలాబాద్ (డాక్టర్ సుమలత) సీట్లపై స్పష్టత వచ్చినట్లు సమాచారం. నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, స్థానికంగా డాక్టర్ అయిన కవితారెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ సీటుకు ప్రవీణ్‌రెడ్డి, వెలిచాల రాజేందర్ పేర్ల పైన పరిశీలన జరిగింది.

సర్వేలు- సమీకరణాలు : పక్కపక్కనే ఉన్న నిజామాబాద్, కరీంనగర్ సీట్లను రెడ్డి సామాజికవర్గానికి కేటాయించడంపై సమావేశంలో అభ్యంతరాలు వ్యక్తం అయినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ సీటును బీసీకి కేటాయించాలనే అంశం తెర మీదకు వచ్చింది. మెదక్‌లో నీలం మధు పేరు ప్రధానంగా పరిశీలనలో ఉన్నా.. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎ్‌సలో చేరిన మరో నేత పేరు చర్చలో ఉన్నట్లు చెబుతున్నారు. భువనగిరి సీటుకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితుడైన చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేరు పరిశీలనలో ఉంది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన భార్య లక్ష్మికి ఆ టికెట్ ఇప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

తుది కసరత్తు : ఖమ్మం స్థానానికి డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క భార్య, మంత్రి పొంగులేటి సోదరుడు, మరో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తనయుడితోపాటు టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ్‌కుమార్ పొటీ పడుతున్నారు. గురువారం పలు రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికపై సీఈసీ మరోసారి భేటీ అవుతోంది. కానీ, ఈ భేటీలో తెలంగాణ అభ్యర్థులపై చర్చ జరగడంలేదు. మలి జాబితా హోలీ పండుగ తర్వాతనే ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. మాల వర్గానికే రెండు సీట్లు (నాగర్ కర్నూల్, పెద్దపల్లి) కేటాయిస్తున్న నేపథ్యంలో మాదిగ వర్గం నేతలు బుధవారం అధిష్ఠానం పెద్దలపై ఒత్తిడి తెచ్చారు. దీంతో, అభ్యర్థుల మలి జాబితా ప్రకటన పట్ల కాంగ్రెస్ ఆశావాహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications