విడదీస్తారా?: 'త్వరలో ఢిల్లీ ఎయిమ్స్‌కు వీణా-వాణిలు'
హైదరాబాద్: అవిభక్త కవలలు వీణా-వాణిలకు నిర్వహించాల్సిన శస్త్రచికిత్స అంశాన్ని పరిశీలించేందుకు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల బృందం గురువారం నగరంలోని నీలోఫర్ ఆస్పత్రికి చేరుకుంది. అనంతరం వీణా-వాణిల ఆరోగ్య పరిస్థితి, శస్త్ర చికిత్స సాధ్యాసాధ్యాలను ఈ బృందం పరిశీలించింది.
వీణా-వాణిలకు శస్త్ర చికిత్స చేసే అవకాశాలపై పరిశీలించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. వీణా-వాణీల శస్త్ర చికిత్స బాధ్యత ప్రభుత్వానిదేనని తెలంగాణ రాష్ట్ర మంత్రి లక్ష్మా రెడ్డి గతంలో స్పష్టం చేశారు. దీంతో ఎయిమ్స్ బృందం హైదరాబాద్ వచ్చి వీణ - వాణిలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన వైద్యుల బృందం త్వరలో ఢిల్లీ ఎయిమ్స్‌కు వీణా-వాణిలను తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. మరింత అధ్యయనం చేశాకే ఆపరేషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇద్దరికీ ఎటువంటి ప్రమాదం లేకుండా ఆపరేషన్ చేయాలన్నదే మా ఆలోచన అని పేర్కొన్నారు.

గతంలోనే వీణా- వాణిలను ఆపరేషన్ ద్వారా వేరు చేసేందుకు లండన్ గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ ఆసుపత్రి వైద్యులు ముందుకు వచ్చారు. అయితే ప్రభుత్వం శస్త్ర చికిత్స విషయం ఎయిమ్స్ చేతిలో పెట్టింది. లండన్ వైద్యులను ఢిల్లీకి రప్పించి ఆపరేషన్ చేయిస్తామని ఎయిమ్స్ చెప్పింది.
ఈ నేపథ్యంలో ఆపరేషన్ ఖర్చు పైన స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఎయిమ్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఇందుకు గాను రూ. 10 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. దీంతో పాటు ఆపరేషన్‌కు 10 నెలల సమయం పడుతుందని అంతవరకు తమ పర్యవేక్షణలోనే చిన్నారులు ఉంటారని చెప్పారు.
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
మహబూబ్‌నగర్ జిల్లాలోని కొత్తపేట మండలం రామన్‌పాడులో బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినికి వివాహం చేయాలని బాలిక తల్లిదండ్రులు చూశారు. గ్రామానికి చేరుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు పెళ్లిని నిలిపివేసి, బాలిక కుటుంబ సభ్యులకు అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు.












Click it and Unblock the Notifications