అసదుద్దీన్ ఒవైసీకి షాక్.. ఉద్రిక్తత
Asaduddin Owaisi: అఖిల భారత మజ్లిస్- ఇ- ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీకి ఊహించని సంఘటన ఎదురైంది. కొందరు వ్యక్తులు ఇంటిపై దాడి చేశారు. పోస్టర్లను అంటించారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన చేసిన నినాదం.. దీనికి కారణం అయింది.
గురువారం రాత్రి దేశ రాజధానిలోని అసదుద్దీన్ ఇంటి వద్ద ఈ ఘటన సంభవించింది. చాలాకాలంగా ఢిల్లీ అశోకా రోడ్‌లో నంబర్ 34 బంగళాలో నివాసం ఉంటోన్నారాయన. ఇది ఆయన అధికారిక నివాసం. లోక్‌సభ సభ్యుడిగా ఉన్నందున పార్లమెంట్ సెక్రెటేరియట్ దీన్ని కేటాయించింది.

రాత్రి కొందరు వ్యక్తులు.. ఈ ఇంటిపై దాడికి దిగారు. రాళ్లు విసిరారు. నల్లరంగు ఇంక్‌ను చల్లారు. భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు. అవే నినాదాలను రాసి ఉన్న పోస్టర్లను ఇంటి ప్రదాన గేటుకు అంటించారు. అసదుద్దీన్ ఒవైసీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. తాము ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తోన్నామంటూ పేర్కొన్నారు.
లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అసద్.. పాలస్తీనాకు అనుకూలంగా నినాదం చేసిన విషయం తెలిసిందే. జై పాలస్తీనా అంటూ నినదించారు. ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఈ నినాదం చేయాల్సి వచ్చింది. దీనికి నిరసనగా తాజా దాడి ఘటన చోటు చేసుకుంది.
ఈ దేశంలో నివసించే ప్రతి ఒక్కరూ భారత్ మాతాకు జై అనాల్సిందేనని, దీనికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలను తీసుకోవాలంటూ వాళ్లు డిమాండ్ చేశారు. భారత గడ్డపై జీవించాలంటే ఈ దేశాన్ని ప్రేమించక తప్పదనీ పేర్కొన్నారు. వ్యతిరేక కార్యకాలాపాాలకు పాల్పడే వారికి ఇక్కడ నివసించే హక్కు లేదని అన్నారు.

ఈ ఘటనతో అసద్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోస్టర్లను చించివేశారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటన తరువాత అటు హైదరాబాద్‌లో ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు.
ఇంటిపై దాడి పట్ల అసద్ స్పందించారు. తన అధికారిక నివాసంపై దాడి చేయడం ఇది కొత్తేమీ కాదని వ్యాఖ్యానించారు. ఢిల్లీ పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని చెప్పారు. ఇదంతా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కనుసన్నల్లో సాగుతోందంటూ మండిపడ్డారు. ఢిల్లీ పోలీసుల కళ్లముందే ఈ దాడి జరిగిందంటూ ధ్వజమెత్తారు.
దేశ రాజధానిలో లోక్‌సభ సభ్యులు సురక్షితంగా ఉండగలారా? లేదా? అనే విషయాన్ని తేల్చి చెప్పాలంటూ స్పీకర్ ఓం బిర్లాకు డిమాండ్ చేశారు. సావర్కర్ తరహాలో తాను ఇంట్లో లేనప్పుడు దాడికి వచ్చి, రాళ్లు విసరడం, ఇంక్ చల్లడం కాదని, ధైర్యం ఉంటే తనను నేరుగా ఎదుర్కొనాలంటూ సవాల్ విసిరారు.
-
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
కాశీలో బిర్యానీ తింటే మనోభావాలు దెబ్బతింటాయా?: ఒవైసీ -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications